Share News

గుడ్‌మార్నింగ్‌కు బదులు... జైభీం అనాలి

ABN , Publish Date - Mar 06 , 2025 | 12:06 AM

విద్యాబద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు పాఠాలు బోధించ కుండా జై భీం అనాలంటూ నిత్యం విద్యార్థులను వేధిస్తున్నారని, ఆ మాష్టారు వద్దంటూ విద్యార్థులు ఆందోళన చేసిన సంఘటన మండలం లోని నిట్టూరు గ్రామంలో చోటుచేసుకుంది. నిట్టూరు జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఫిజికల్‌ సైన్స్‌ బోధించే ఉపాధ్యాయుడు లింగమల్ల శంకర్‌ కొంతకాలంగా విద్యార్థులపట్ల వివక్ష చూపి స్తున్నాడు. విద్యార్థుల తల్లిదండ్రులు పలు మార్లు చెప్పినా వినక పోవడంతో బుధవారం విద్యార్థులు తల్లిదం డ్రులతో కలిసి పాఠ శాలకు తాళం వేశారు. పాఠశాల ఎదుట విద్యార్థులతోపాటు, తల్లిదండ్రులు బైఠాయించి ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేయాలని నినాదాలు చేశారు.

గుడ్‌మార్నింగ్‌కు బదులు... జైభీం అనాలి

పెద్దపల్లి రూరల్‌, మార్చి 5 (ఆం ధ్రజ్యోతి): విద్యాబద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు పాఠాలు బోధించ కుండా జై భీం అనాలంటూ నిత్యం విద్యార్థులను వేధిస్తున్నారని, ఆ మాష్టారు వద్దంటూ విద్యార్థులు ఆందోళన చేసిన సంఘటన మండలం లోని నిట్టూరు గ్రామంలో చోటుచేసుకుంది. నిట్టూరు జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఫిజికల్‌ సైన్స్‌ బోధించే ఉపాధ్యాయుడు లింగమల్ల శంకర్‌ కొంతకాలంగా విద్యార్థులపట్ల వివక్ష చూపి స్తున్నాడు. విద్యార్థుల తల్లిదండ్రులు పలు మార్లు చెప్పినా వినక పోవడంతో బుధవారం విద్యార్థులు తల్లిదం డ్రులతో కలిసి పాఠ శాలకు తాళం వేశారు. పాఠశాల ఎదుట విద్యార్థులతోపాటు, తల్లిదండ్రులు బైఠాయించి ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేయాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకొన్న ఎస్‌ఐ లక్ష్మణ్‌రావు పాఠశాలకు చేరుకొని మాట్లాడినా వినలేదు. డీఈవో మాధ వితో ఫోన్‌లో మాట్లాడారు. అయినా వినకుండా విద్యార్థులంతా పెద్ద పల్లి-జూలపల్లి వెళ్లే రోడ్డుపై బైఠా యించారు. కలెక్టర్‌, డీఈవో పాఠశాలకు రావాలని నినాదాలు చేశారు. ఆందోళన మూడు గంటల పాటు కొనసాగింది. డీఈవో మాధవి పాఠశాలకు చేరు కొని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఉపాఽధ్యాయుడు శంకర్‌ వల్ల ఇబ్బందికరంగా ఉందని ఆరోపించారు. అతడిని ఇతర పాఠశాలకు డిప్యూటేషన్‌ చేస్తానని, ఆందోళన విరమించాలన్నారు. డీఈవో హామీతో యథావిధిగా పాఠశాల కొనసాగింది.

తెల్లకాగితంపై సంతకాలు

పాఠశాలలో విధులు ముగించుకొని వెళ్లా ల్సిన ఫిజికల్‌ ఉపాధ్యాయుడు శంకర్‌ రాత్రి వేళల్లో విద్యార్థుల ఇంటికి వెళ్లి తెల్లకాగితంపై సంతకాలు తీసుకున్నాడని విద్యార్థులు, గ్రామ స్థులు పేర్కొన్నారు. ఇలా ప్రతీ విద్యార్థి ఇం టికి వెళ్లి సంతకాలు తీసుకొన్నాడని, వాటిపై ఏమి రాస్తాడో తెలియని పరిస్థితి ఉందని ఆం దోళన చెందుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో కులమత బేధాలు లేకుండా పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యా ర్థుల మధ్య కులచిచ్చులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.

మూడు నెలల నుంచే తతంగం..

మూడు నెలలుగా పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య విభేదాలు జరుగు తున్నా వాటిపై అధికారులు నిర్లక్ష్యం చేశారని, వారి మధ్య ఘర్షణలతో విద్యార్థుల జీవి తాలతో ఆడుకుంటున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయులు పోలీస్‌స్టేష న్‌లలో, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసి నప్పుడు అధికారులు మౌనం పాటించడం వెనుక అర్థంకాని పరిస్థితి ఉందన్నారు. కనీసం పాఠశాలను తనిఖీ చేయలేదన్నారు. పాఠశాలల్లో ఏమి జరుగుతుందో ఉన్నతా ధికారులు తనిఖీ చేపట్టాలని, ఇలాంటి సంఘ టనలు దృష్టికి వస్తే అక్కడే పరిష్కరించేం దుకు ఆస్కారం ఉంటుందని తల్లిదండ్రులు పేర్కొన్నారు.

Updated Date - Mar 06 , 2025 | 12:06 AM