Share News

పెద్దపల్లిలో ట్రాఫిక్‌ సిగ్నళ్ల ఏర్పాటు

ABN , Publish Date - Oct 11 , 2025 | 11:44 PM

పట్టణంలో పలు చోట్ల ట్రాఫిక్‌ సిగ్నళ్ళు శనివారం పోలీసులు ఏర్పాటు చేశారు. గతంలో అయ్యప్ప టెంపుల్‌, బస్టాండ్‌ వద్ద సిగ్నల్స్‌ మాత్రమే పని చేసేవి. జిల్లా కేంద్రం కావడంతో పట్టణంలో వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారింది.

పెద్దపల్లిలో ట్రాఫిక్‌ సిగ్నళ్ల ఏర్పాటు

పెద్దపల్లిటౌన్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో పలు చోట్ల ట్రాఫిక్‌ సిగ్నళ్ళు శనివారం పోలీసులు ఏర్పాటు చేశారు. గతంలో అయ్యప్ప టెంపుల్‌, బస్టాండ్‌ వద్ద సిగ్నల్స్‌ మాత్రమే పని చేసేవి. జిల్లా కేంద్రం కావడంతో పట్టణంలో వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారింది. దీంతో మంథని ఫ్లైఓవర్‌, బస్టాండ్‌ వద్ద రూట్ల మార్చుతు కొత్త సిగ్నళ్ళ ఏర్పాటు చేశారు. కమాన్‌ చౌరస్తా, కునారం రోడ్డులో సిగ్నల్స్‌ ఉన్నప్పటికి వాటిని ప్రారంభించ లేదు. వాటిని కూడా కొంత మార్పు చేర్పులు చేస్తు ప్రాంభించారు.

కలెక్టరెట్‌ వద్ద కొత్త సిగ్నల్‌ ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వాస్పత్రి వద్ద కొత్త సిగ్నల్‌ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ట్రాఫిక్‌ సీఐ అనీల్‌కుమార్‌ మాట్లాడుతూ పట్టణ కేంద్రంలో రోడ్డు ఇరుకుగా ఉండి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందన్నారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా పలు చోట్ల రోడ్డు వెడల్పు చేయించామన్నారు. సిగ్నళ్ల వద్ద రూట్లు మార్చామన్నారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్‌ నిబంధనలు పాటి స్తే ప్రమాదాలు జరుగవన్నారు. వాహనానికి సంబంధించిన పత్రా లు సక్రమంగా ఉండాలని సూచించారు. తాగి వాహనం నడుపరాదన్నారు. ఎస్సై సహాదేవ్‌సింగ్‌ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 11:44 PM