Share News

దారి మైసమ్మ విగ్రహాల ప్రతిష్ఠాపన

ABN , Publish Date - Nov 08 , 2025 | 11:48 PM

రామగుండం కార్పొరేషన్‌లో దారి మైసమ్మ, ఏల్పుమ్మ విగ్రహాల ప్రతిష్టాపనను శనివారం కాంగ్రెస్‌ నాయకులు మహంకాళిస్వామి, కాల్వ లింగస్వామి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని ఆటో అడ్డా వద్ద ఒజ్జల వెంకన్నశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు గణపతి హోమం నిర్వహిం చారు.

దారి మైసమ్మ విగ్రహాల ప్రతిష్ఠాపన

కళ్యాణ్‌నగర్‌, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): రామగుండం కార్పొరేషన్‌లో దారి మైసమ్మ, ఏల్పుమ్మ విగ్రహాల ప్రతిష్టాపనను శనివారం కాంగ్రెస్‌ నాయకులు మహంకాళిస్వామి, కాల్వ లింగస్వామి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని ఆటో అడ్డా వద్ద ఒజ్జల వెంకన్నశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు గణపతి హోమం నిర్వహిం చారు. వారు మాట్లాడుతూ కార్పొరేషన్‌ అధికారుల తప్పిదంతో కూలగొ ట్టారని, అధికారుల తప్పిదంపై చర్యలు ఉంటాయన్నారు.

ప్రతి డివి జన్‌లో 2గుంటల భూమిలో పోచమ్మ, మైసమ్మ, ఏల్పమ్మ గుళ్ల నిర్మాణం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ సొంత డబ్బులతో నిర్మిస్తున్నారని, ఎక్కడైతే కూలగొట్టారో అక్కడ నిర్మాణాన్ని పునః ప్రారంభించనున్నట్టు చెప్పారు. కొందరు నాయకులు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రజల నిర్ణ యం మేరకే జరుగుతాయని తెలిపారు. నాయకులు తిప్పారపు శ్రీని వాస్‌, దీటి బాలరాజు, పెద్దెల్లి ప్రకాష్‌, బొమ్మక రాజేష్‌, గట్ల రమేష్‌, గడ్డం శ్రీనివాస్‌, ఎండీ ముస్తాఫా, దాసరి ఉమాదేవి, ఆడెపు దశరథం, నాయిని ఓదెలు, కొప్పుల శంకర్‌, పాల్గొన్నారు.

Updated Date - Nov 08 , 2025 | 11:48 PM