నేటి నుంచి ఇన్‌స్పైర్, వైజ్ఞానిక ప్రదర్శనలు
ABN , Publish Date - Dec 01 , 2025 | 11:54 PM
జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలు, ఇన్‌స్పైర్ అవార్డ్ మనాక్ జంట ఎగ్జిబిషన్‌లు ఎన్టీపీసీ ఉన్నత పాఠశాలలో ఈనెల 2, 3, 4 తేదీల్లో జరగనున్నాయి. సోమవా రం జిల్లా విద్యాధికారి శారద ఏర్పాట్లను పరిశీలించారు.
జ్యోతినగర్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలు, ఇన్‌స్పైర్ అవార్డ్ మనాక్ జంట ఎగ్జిబిషన్‌లు ఎన్టీపీసీ ఉన్నత పాఠశాలలో ఈనెల 2, 3, 4 తేదీల్లో జరగనున్నాయి. సోమవా రం జిల్లా విద్యాధికారి శారద ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆమె ఎన్‌టీపీసీ ఈడీ చందన్‌కుమార్‌కు కలిసి వేడుకలకు ఆహ్వానిం చారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రాథమిక, ఉన్నత పాఠశాలల నుండి డీఎల్‌బీవీపీలోని 7 ఉప అంశాలకు అనుగుణంగా ప్రాజెక్టులతో హాజరు కావాలన్నారు. జూనియర్ 6-8 తరగతులు, సీనియర్ 9నుంచి 12 తరగతుల విద్యార్థులు ఆయా విభాగాలలో ప్రదర్శించాలన్నారు. అలాగే జిల్లా నుంచి గత విద్యా సంవత్సరం ఎంపికైన 106 ఇన్‌స్పైర్ అవార్డు మనాక్ ప్రాజెక్టుల విద్యార్థులు పాల్గొని తమ ఎగ్జిబిట్లను ప్రద ర్శిస్తారని ఆమె తెలిపారు. మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యా యులు, గైడ్ టీచర్లు విద్యార్థులను ప్రోత్సహిస్తూ నాణ్యమైన ఆవిష్కర ణలకు సహాయ సహకారాలను అందించాలని కోరారు. ఇందులో స్టెమ్ ఫర్ వికసిత్, ఆత్మనిర్బర్ భారత్ ఇతివృత్తంగా సుస్థిర వ్యవసాయం, వ్యర్థ పదార్థాల నిర్వహణ, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలు, గ్రీన్ ఎనర్జీ, సాంకేతికత, గణిత నమునాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, నీటి సంరక్షణ ఉప అంశాలల్లో విద్యార్థులు ప్రాజెక్టులను ప్రదర్శించాలన్నారు. ప్లాస్టిక్ కాలుష్యం తగ్గించే అంశంపై సెమినార్‌లో పాల్గొనాలని తెలిపారు. డీసీఈబీ కార్యదర్శి హన్మంతు, మండల విద్యాధికారులు మల్లేశం, సురేందర్, విమల, ప్రధానోపాధ్యాయులు ఆగయ్య, స్వర్ణలత, ఉపాధ్యా యులు పాల్గొన్నారు.