Share News

యూరియా కోసం వినూత్న నిరసన

ABN , Publish Date - Aug 31 , 2025 | 12:36 AM

గణపతి బొప్పా మోరియా.. రైతులకు కావాలయ్యా యూరియా అంటూ.. పాత పెట్రోల్‌ పంపు చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు, రైతులు శనివారం వినూత్నంగా ఆందోళన చేశారు. రైతు సేవా కేంద్రం నిర్వా హకుడు, వ్యవసాయాధికారుల వైఖరిని నిరసిస్తూ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

యూరియా కోసం వినూత్న నిరసన

మంథని, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): గణపతి బొప్పా మోరియా.. రైతులకు కావాలయ్యా యూరియా అంటూ.. పాత పెట్రోల్‌ పంపు చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు, రైతులు శనివారం వినూత్నంగా ఆందోళన చేశారు. రైతు సేవా కేంద్రం నిర్వా హకుడు, వ్యవసాయాధికారుల వైఖరిని నిరసిస్తూ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రైతులకు యూరియా బాధలు తప్పించాలని విఘ్నే శ్వరుడి భజనలు చేశారు. రైతు సేవా కేంద్రాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే యూరియా బస్తాల స్టాక్‌, రైతులకు పంపిణీపై కేంద్రం నిర్వాహకుడు బాపు, అధికారులను అడగగా వారు చెప్పిన నిల్వల్లో తేడా ఉండడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం పార్టీ శ్రేణుల తో కలిసి గణపతి విగ్రహంతో ఆందోళనకు దిగారు. ఈక్రమంలో పుట్ట మధు, పోలీసు అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. రైతులకు యూరియా ఇస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

అనంతరం పుట్ట మధు విలేకరులతో మాట్లాడుతూ రైతులు యూరియా కోసం రోజుల తరబడి నానాతంటాలు పడుతుంటే కాం గ్రెస్‌ నేతలు బ్లాక్‌ చేసి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. గోదాంలో 110 బస్తాలు ఉన్నాయని, 40 మంది రైతులకు రెండు బస్తాల చొప్పున ఇస్తామని వ్యాపారి తెలుపగా ఏఈవో 70 బస్తాల స్టాక్‌ ఉం దని చెప్పడం అనుమానాలకు తావిస్తుందన్నారు. ఎమ్మెల్యే నాయ కత్వంలో బ్లాక్‌ దందా కొనసాగుతుందన్నారు. కల్వచర్లలో అక్రమంగా తరలిస్తున్న వంద బస్తాలను పట్టుకున్నారన్నారు. పోలీసులు రైతుల పక్షాన నిలబడి న్యాయం చేయాలి తప్ప కాంగ్రెస్‌ పార్టీకి వత్తాసు పలుకవద్దన్నారు. ఏగోళపు శంకర్‌గౌడ్‌, తగరం శంకర్‌లాల్‌, వంశీ, తిరుపతి, కనవేన శ్రీనివాస్‌, కాయితి సమ్మయ్యలు పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2025 | 12:37 AM