Share News

లాభాల వాటాలో కార్మికులకు అన్యాయం

ABN , Publish Date - Sep 23 , 2025 | 11:48 PM

2024-25 సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాలు రూ.6394కు రూ.2360కోట్లు మాత్రమే ప్రకటించి రూ.4034కోట్లు పక్కన, మిగిలిన రూ.2360కోట్లలో 34శాతం ప్రకటించడం అన్యాయమని టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. లాభాల వాటాలో అన్యాయం జరిగిందని మంగళవారం జీడీకే2 ఇంక్లైన్‌లో కార్మికులతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

లాభాల వాటాలో కార్మికులకు అన్యాయం

గోదావరిఖని, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): 2024-25 సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాలు రూ.6394కు రూ.2360కోట్లు మాత్రమే ప్రకటించి రూ.4034కోట్లు పక్కన, మిగిలిన రూ.2360కోట్లలో 34శాతం ప్రకటించడం అన్యాయమని టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. లాభాల వాటాలో అన్యాయం జరిగిందని మంగళవారం జీడీకే2 ఇంక్లైన్‌లో కార్మికులతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ రూ.5లక్షల లాభాల వాటా రావాల్సిన కార్మికునికి రూ.1.95లక్షలకే పరిమితం చేయడం సింగరేణి కార్మిక వర్గం శ్రమను దోచుకోవడమేనని, గత సంవత్సరం సింగరేణి అభివృద్ధికి పక్కన పెట్టిన రూ.2289 కోట్లు ఏమయ్యాయో తెలుపాలన్నారు. ఈ సంవత్సరం వాస్తవ లాభాలలో 12.5 మాత్రమే లాభాల వాటా కార్మిక వర్గానికి చెందిందన్నారు. ఇటువంటి ప్రక్రియ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మొదలైందని, దీనిపై పోరాడాల్సిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు స్పందించక పోవడం శోచనీయమన్నారు. కార్మిక వర్గానికి జరుగుతున్న నష్టంపై సంఘాలు కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి పేరిట సింగరేణి సంస్థకు చెందిన రూ.6వేల కోట్లపై చిలుకు నిధులను పక్కన పెట్టారని, ఇప్పటి వరకు వీటిని ఏ రకంగా ఉపయోగిస్తున్నారో తెలియదన్నారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కూడా నోరు మెదపకపోవడం. ప్రభుత్వానికి సహకరిస్తూ కార్మికులను లూటీ చేస్తున్నారని పేర్కొన్నారు. టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి శంకర్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కోశాధికారి చెల్పూరి సతీష్‌, దూట శేషగిరి, ఉప్పులేటి తిరుపతి, మీస రాజు, భాస్కర్‌ దేవేందర్‌, నరేష్‌ పటేల్‌, మధు సుకుమార్‌, ప్రసాద్‌ దేవేందర్‌, ప్రసాద్‌, వేణు, టిప్పు సుల్తాన్‌, రమేష్‌ పాల్గొన్నారు.

06జీడీకే23

Updated Date - Sep 23 , 2025 | 11:48 PM