Share News

బనకచర్ల ప్రాజెక్ట్‌ తో తెలంగాణకు అన్యాయం

ABN , Publish Date - Jul 20 , 2025 | 11:31 PM

బనకచర్ల ప్రాజె క్టుతో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని, కాం గ్రెస్‌, బీజేపీ, టీడీపీలు గోదావరి జలాలను దోపిడీ చేస్తున్న కుట్రలో భాగమని బీఆర్‌ ఎస్‌వీ కోఆర్డినేటర్‌ కొలుగోరి సాయికుమార్‌ (చింటు) అన్నారు. ఆదివారం గోదావరిఖని లో బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో బీసీ, ఎస్‌సీ హాస్టల్‌లో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రా లను విద్యార్థులకు పంపిణీ చేశారు.

బనకచర్ల  ప్రాజెక్ట్‌ తో తెలంగాణకు అన్యాయం

కోల్‌సిటీటౌన్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): బనకచర్ల ప్రాజె క్టుతో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని, కాం గ్రెస్‌, బీజేపీ, టీడీపీలు గోదావరి జలాలను దోపిడీ చేస్తున్న కుట్రలో భాగమని బీఆర్‌ ఎస్‌వీ కోఆర్డినేటర్‌ కొలుగోరి సాయికుమార్‌ (చింటు) అన్నారు. ఆదివారం గోదావరిఖని లో బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో బీసీ, ఎస్‌సీ హాస్టల్‌లో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రా లను విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ గోదా వరి నదిలో 200టీఎంసీల వాటాను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల గోదావరి నీటిని రాయలసీమకు తరలిం చడానికి ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన అక్రమ ప్రాజెక్టు పోలవరం- బనకచర్ల లింక్‌ ప్రాజెక్ట్‌ అని వివరించారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడా ల్సిన సీఎం రేవంత్‌ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబునా యుడు కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయి సహకరి స్తున్నారన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో కళ్యాణ్‌, శ్రీకాంత్‌, రాకేష్‌, అజయ్‌, శశి, హరీశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2025 | 11:31 PM