Share News

మౌలిక వసతుల్లో లోపాలు తలెత్తకుండా చూడాలి

ABN , Publish Date - Dec 09 , 2025 | 11:57 PM

రామగుండం కార్పొరేషన్‌లో ప్రజ లకు మౌలిక వసతులు పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణలో లోపాలు తలెత్తకుండా వార్డు అధికారులు సమర్థవంతంగా పర్యవేక్షణ చేయా లని నగరపాలక సంస్థ కమిషనర్‌ అరుణశ్రీ సూచించారు.

మౌలిక వసతుల్లో లోపాలు తలెత్తకుండా చూడాలి

కోల్‌సిటీ, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రామగుండం కార్పొరేషన్‌లో ప్రజ లకు మౌలిక వసతులు పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణలో లోపాలు తలెత్తకుండా వార్డు అధికారులు సమర్థవంతంగా పర్యవేక్షణ చేయా లని నగరపాలక సంస్థ కమిషనర్‌ అరుణశ్రీ సూచించారు. మంగళవారం వార్డు అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.

ఆమె మాట్లాడుతూ పారి శుధ్య నిర్వహణలో ప్రవేశపెట్టిన రెండు పూటల పని విధానాన్ని, సిబ్బంది హాజరు, చెత్తసేకరణ, బీఆర్‌సీ కేంద్రానికి పొడి చెత్త, కంపోస్ట్‌ యార్డుకు చెత్త వెళ్లేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. అడిషనల్‌ కమిషనర్‌ మారుతి ప్రసాద్‌, ఈఈ రామన్‌, సెక్రటరీ ఉమా మహేశ్వర్‌రావు, అసిస్టెంట్‌ కమిష నర్‌ వెంకటేశ్వర్లు, ఆర్‌ఓ ఆంజనేయులు, సూపరింటెండెంట్‌ పబ్బాల శ్రీని వాస్‌, డీఈలు, ఏఈలు, వార్డు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 09 , 2025 | 11:57 PM