శిశు మరణాలను తగ్గించాలి
ABN , Publish Date - Dec 05 , 2025 | 11:58 PM
గోదావరిఖని ప్రభుత్వ జన రల్ ఆసుపత్రిలోని నవజాత శిశు కేంద్రాన్ని సంకల్ప ప్రోగ్రాం అధికారి శ్రీరాములు, వైద్యాధికారి లక్ష్మీభవాని, వెంకటేశ్వర్లు, డీహెచ్‌ఎంవో వాణిశ్రీ శుక్రవారం సందర్శించారు. ఆసుపత్రిలోని నవజాత శిశువుల చికిత్స విధా నాన్ని పరిశీలించారు.
కళ్యాణ్‌నగర్, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని ప్రభుత్వ జన రల్ ఆసుపత్రిలోని నవజాత శిశు కేంద్రాన్ని సంకల్ప ప్రోగ్రాం అధికారి శ్రీరాములు, వైద్యాధికారి లక్ష్మీభవాని, వెంకటేశ్వర్లు, డీహెచ్‌ఎంవో వాణిశ్రీ శుక్రవారం సందర్శించారు. ఆసుపత్రిలోని నవజాత శిశువుల చికిత్స విధా నాన్ని పరిశీలించారు. తక్కువ బరువుతో పుట్టిన శిశువులు, నెలలు నిం డక ముందు పుట్టిన శిశువులపై ఆరా తీశారు. డీఎంహెచ్‌వో మాట్లా డుతూ శిశు మరణాల రేటు తగ్గించాలని, శిశువులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు తల్లులకు అవగాహన కల్పించాలని, నెలలు నిండక ముందు పుట్టిన శిశువులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన శిశువులను ఎప్పటికప్పుడు ఫాలోప్ చేస్తూ క్షేత్ర స్థాయి సిబ్బందిచే గృహ సందర్శనలు చేయాలన్నారు. శిశువుల ఎదుగు దలకు ప్రత్యేక ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అనంతరం అడ్డగుంటపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సిబ్బంది హాజరు రిజిష్టర్‌ను పరిశీలించారు. ప్రతి మంగళవారం మహిళ ఆరోగ్య కేంద్రాన్ని నిర్వహించేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. పిల్లల వైద్య నిపుణుడు రాజీవ్, నర్సింగ్ ఆఫీసర్ సువర్ణ, ల్యాబ్ ఇన్‌చార్జి శివ ఉన్నారు.
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
కోల్‌సిటీ, (ఆంధ్రజ్యోతి): లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తీసుకుం టామని డీఎంహెచ్‌వో వాణిశ్రీ చెప్పారు. శుక్రవారం పలు ప్రైవేట్ ఆసు పత్రులను, స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని స్కానింగ్ డాటా, ఫారం-ఎఫ్ సంబంధిత రికార్డులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చేయడం నేరమని, డయాగ్నోక్ టెక్నిక్ చట్టం 1994 ప్రకారం చట్ట విరుద్ధమని, ఎవరైనా గర్భంలో ఉన్న శిశువు ఆడ, మగ అని చెబితే చర్యలు తీసుకుంటామన్నారు.