Share News

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు

ABN , Publish Date - Aug 27 , 2025 | 12:16 AM

అర్హులైన నిరుపేదలకు ఇంది రమ్మ ఇండ్లను ప్రజా ప్రభుత్వం మంజూరు చేస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. అబ్బాపూర్‌లో మంగళవారం ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనా లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేవారు.

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు

జూలపల్లి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి) అర్హులైన నిరుపేదలకు ఇంది రమ్మ ఇండ్లను ప్రజా ప్రభుత్వం మంజూరు చేస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. అబ్బాపూర్‌లో మంగళవారం ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనా లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేవారు. సమావే శంలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన ప్రతి కుటుం బానికి అందిస్తామని, అలాగే ఇంటి నిర్మాణాలకు ఉపయోగించే ఇసుక ను లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తామన్నారు.

ఇందిరమ్మ ఇంటి నిర్మా ణాలను పూర్తిచేస్తున్న లబ్ధిదారులు దశలవారీగా ఇంటి బిల్లులను పొందేందుకు గ్రామాల్లో కార్యదర్శులను, పట్టణాల్లో వార్డు ఆపీసర్లకు వివరాలను అందించాలని సూచించారు. అలాగే అర్హత ఉండి ఇల్లు మంజూరు కాని పేదప్రజలు ఆందోళన చెందవద్దని విడుతల వారీగా అందరికి ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గండు సంజీవ్‌, తహసీల్దార్‌ జక్కని స్వర్ణ, ఎంపిడిఓ పద్మజ, నాయకులు దండె వెంకటేశం, మానుమండ్ల శ్రీనివాస్‌, పలువురు పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2025 | 12:16 AM