ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపునకు యాప్..
ABN , Publish Date - Sep 07 , 2025 | 12:04 AM
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల బిల్లుల చెల్లింపులో జాప్యా న్ని నివారించేందుకు, అవినీతిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో లబ్ధిదారులే ఫొటోలు అప్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ విధానం ఈనెల 4వ తేదీ నుంచే అమలులోకి వచ్చింది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల బిల్లుల చెల్లింపులో జాప్యా న్ని నివారించేందుకు, అవినీతిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో లబ్ధిదారులే ఫొటోలు అప్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ విధానం ఈనెల 4వ తేదీ నుంచే అమలులోకి వచ్చింది. అలాగే ఇళ్లకు సంబంధించి, బిల్లుల చెల్లింపునకు ఎవ రైనా డబ్బులు కావాలని వేధింపులకు గురి చేస్తే ఫిర్యా దు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్ 18005995991ను గృహ నిర్మాణ శాఖ అందుబాటులోకి తీసుక వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇం దిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని అందుబాటులోకి తీసు కువచ్చిన విషయం తెలిసిందే. ప్రతీ అసెంబ్లీ నియో జకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించగా, జిల్లాకు 9421 ఇళ్లు మంజూరు చేశారు. అందులో 5,986 ఇళ్లకు లబ్ధి దారులను ఎంపిక చేశారు. 4,048 ఇళ్లకు ముగ్గులు పోశారు. 1,505 ఇళ్లు బేస్‌మెంట్ స్థాయిలో, 200 ఇళ్ల గోడల వరకు, శ్లాబ్ స్థాయి వరకు 220 ఇళ్లు, నాలుగు ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా, 1,929 ఇళ్ల పనులు ప్రగ తిలో ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలు, ఇంతవరకు చేసిన చెల్లింపులు, తదితర సమాచార మంతా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. బిల్లు ఎక్కడ ఉంది, ఏ తేదీన, ఎంత మొత్తం ఏ బ్యాంక్ అకౌంట్‌లో జమ తదితర వివరాలు పారదర్శకంగా అం దరికీ అందుబాటులోకి తీసుకవచ్చారు. దీంతో లబ్ధిదా రులు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అధికారులు, సిబ్బంది చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు, మండల స్థాయిల్లో ఉద్ధేశ పూర్వక జాప్య నివారణకు, అక్కడక్క డా జరుగుతున్న అవినీతిని అరికట్టడానికి ఇందిరమ్మ యాప్‌ను తీసుకవచ్చారు. బిల్లుల కోసం స్వయంగా ఫొటోలు తీసుకుని అప్‌లోడ్ చేసే విధంగా యాప్‌ను ఆధునీకరించారు. ఈ నెల 4వ తేదీ నుంచి దానిని అం దుబాటులోకి తీసుక వచ్చారని జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ రాజేశ్వర్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
అప్‌లోడ్ విధానం ఇలా...
మొదట మొబైల్ ఫోన్‌లో ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత లబ్ధిదారుడి లాగిన్‌లో మొబైల్ నంబరు నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేసిన తర్వాత డ్యాష్ బోర్డులో లబ్ధిదా రుడి పేరు, మొబైల్ నంబరు తదితర వివరాలతో పాటు ఫొటోలు తీయడం (క్యాప్చర్ ఫొటోగ్రాఫ్) అనే వాటి కింద ఇళ్ల నిర్మాణపు దశలు (గ్రౌండింగ్, బేస్‌మెం ట్, వాలింగ్, స్లాబ్, నిర్మాణం పూర్తి) అని కనిపిస్తాయి.
లబ్ధిదారులు గ్రౌండింగ్ స్థాయి ఫొటోలు అప్ లోడ్ చేయాలనుకుంటే గ్రౌండింగ్ క్లిక్ చేస్తే దరఖాస్తు దారుడికి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. లబ్ధిదా రులు ప్రతిపాదిత ఇంటి నిర్మాణ స్థలం నుంచే మొబైల్ ఫోన్‌లోని కెమెరాతో ఫొటోలు తీయాలి, ఇక్కడే కెమె రాలో జియో ట్యాగింగ్ నిమిత్తం మ్యాప్ సింబల్‌ను క్లిక్ చేసి వివరాలు నమోదు చేసి, ఒకసారి సరిచూసుకున్న తర్వాత సబ్‌మిట్ చేయాలి. ఆ తర్వాత వెనక్కి వెళ్లి గ్రౌండింగ్ బటన్‌ను క్లిక్ చేస్తే వివరాలన్నీ కనిపిస్తాయి.
బేస్‌మెంట్ స్థాయిలో నిర్మాణ పనులు జరుగు తున్న ఇంటి వద్ద లబ్ధిదారుడితోపాటు ముందు వైపు నుంచి, పక్క నుంచి, పైనుంచి (టాప్ యాంగిల్) ఫొటోలు తీయాలి. ఈ ఫొటోలు గ్రౌండింగ్ సమయంలో తీసిన ప్రాంతం సమీపం నుంచే తీయాలి. యాప్ అడి గిన సమాచారాన్ని నమోదు చేసి సబ్‌మిట్ చేయాలి. ఇదే తరహాలో వాలింగ్ దశలోనూ, స్లాబ్ దశలోనూ, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఫొటోలు తీసి లబ్ధిదారులే నేరుగా బిల్లుల కోసం అప్‌లోడ్ చేయొచ్చు.
గ్రామ కార్యదర్శులు, ఎంపీడీఓలు, డీఈఈలు పీడీ, తదితర అధికారులు, ఈ విధంగా నమోదైన వివరాలను క్షేత్ర స్థాయిలో సరిచూసుకున్న తర్వాతనే లబ్ధిదారులకు బిల్లులు విడుదల చేస్తారు.