ఇందిరా మహిళా శక్తి భవనాలు పూర్తి చేయాలి
ABN , Publish Date - Jun 09 , 2025 | 11:51 PM
జిల్లాలో చేపట్టిన ఇందిరా మహిళా శక్తి భవనాలు నవంబర్ నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. సోమవారం హైదరా బాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావుతో కలిసి బడిబాట, ఇందిరా మహిళాశక్తి కార్యక్రమాలపై కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పెద్దపల్లి, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపట్టిన ఇందిరా మహిళా శక్తి భవనాలు నవంబర్ నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. సోమవారం హైదరా బాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావుతో కలిసి బడిబాట, ఇందిరా మహిళాశక్తి కార్యక్రమాలపై కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ మహిళా శక్తి భవనాలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నవంబర్‌లో శంకుస్థాపన చేశామని, చాలా జిల్లాలో వీటి పురోగతి ఆశించిన స్థాయిలో లేదన్నారు. పంచాయతీరాజ్ ఇంజనీర్ల సమన్వయం చేసుకుంటూ నిర్ధేశించుకున్న గడువులోపు పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. విద్యా ర్థుల ఏకరూప దుస్తులతోపాటు పాఠ్య పుస్తకాలను ఈనెల 12న పాఠశా లలో పునఃప్రారంభం నాడు పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు. పాఠశాలల్లో పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ పంప్‌లు, రైస్‌మిల్లులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు, ఆర్టీసీకి అద్దె బస్సులు వంటి కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ఉత్ప త్తి ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ గాంధీ జయంతి నాటికి పూర్తి చేయాలన్నారు. ప్రతీ జిల్లాలో మహిళా సంఘాల ద్వారా విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సబ్ స్టేషన్ పరిధిలో 8 ఎకరాల స్థలాన్ని గుర్తించాలన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీఈఓ డి మాధవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.