పాకిస్థాన్‌పై దాడితో సత్తా చాటిన భారత సైన్యం
ABN , Publish Date - May 23 , 2025 | 11:20 PM
ఉగ్రదాడికి ప్రతి దాడి చేసి ప్రపంచ దేశాలకు భారత సైన్యం సత్తాచాటామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం పిలుపులో భాగంగా పహెల్గాం వద్ద ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకార దాడులను చేసి పాకిస్థాన్ దేశానికి తగిన గుణపాఠం చెప్పిన దేశ సైనికుల వెంట తామున్నామని జిల్లా కేంద్రంలో శుక్రవారం తిరంగా ర్యాలీ చేపట్టారు.
పెద్దపల్లి టౌన్, మే 23 మే 23 (ఆంధ్రజ్యోతి): ఉగ్రదాడికి ప్రతి దాడి చేసి ప్రపంచ దేశాలకు భారత సైన్యం సత్తాచాటామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం పిలుపులో భాగంగా పహెల్గాం వద్ద ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకార దాడులను చేసి పాకిస్థాన్ దేశానికి తగిన గుణపాఠం చెప్పిన దేశ సైనికుల వెంట తామున్నామని జిల్లా కేంద్రంలో శుక్రవారం తిరంగా ర్యాలీ చేపట్టారు. వారు మాట్లాడుతూ పాకిస్థాన్‌తో జరిపిన యుద్ధంతో ప్రపంచ దేశాలు భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేశారని అభినందించారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో 34 నిమిషాల్లోనే శత్రుదేశంలోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశారన్నారు. పహెల్గాం ఘటన తర్వాత పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భావించినట్లు ఆపరేషన్ సిందూరులో పాల్గొన్న సైనికుడు ఆరీఫ్ తెలి పారు. దేశమంతా ఒక్కటిగా నిలవడం గర్వంగా ఉం దని, యువత సైన్యంలో చేరాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆరీఫ్‌ను ఉపాధ్యాయ సన్మా నించారు. సిటిజన్ ఫర్ నేషన్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో జరిగిన తిరంగా ర్యాలీకి ప్రజ లు భారీగా తరలివచ్చారు. వ్యాపారులు, ఉద్యోగులు, అధికారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతబట్టి భారత్ మాతా కీ జై, జైజవాన్ జై కిసాన్ నినాదా లతో హోరెత్తించారు. మాజీ ఎమ్మెల్యే లింగయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సం జీవరెడ్డి, కందుల సంధ్యారాణి, ఠాకూర్ రాంసింగ్, కన్నం అంజయ్య, పల్లె సదానందం, పర్ష సమ్మయ్య, వెల్లంపల్లి శ్రీనివాసరావు, కంకణాల జ్యోతిబసు, జంగ చక్రధర్ రెడ్డి, సంతోష్, కోల హిమగిరి, నరేష్, శ్రీకాంత్ పాల్గొన్నారు.