రామగుండంలో పెరిగిన డివిజన్లు
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:20 AM
రామగుండం నగరపాలక సంస్థలో డివిజన్ల సంఖ్య 50 నుంచి 60కి పెరిగింది. అంతర్గాం మండలం లింగాపూర్, కుందనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అక్బర్‌నగర్, రామగిరి మండలం వెంకట్రావ్‌పల్లె, పాలకుర్తి మండలం ఎల్కలపల్లి గేట్ గ్రామపంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేశారు. దీంతో కార్పొరేషన్ విస్తీర్ణం 93.87 చదరపు కిలో మీటర్ల నుంచి 99.5చదరపు కిలోమీటర్లకు పెరిగింది. ఓటర్ల సంఖ్య 1.78లక్షలుగా ఉంది.
కోల్‌సిటీ, జూన్ 3(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థలో డివిజన్ల సంఖ్య 50 నుంచి 60కి పెరిగింది. అంతర్గాం మండలం లింగాపూర్, కుందనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అక్బర్‌నగర్, రామగిరి మండలం వెంకట్రావ్‌పల్లె, పాలకుర్తి మండలం ఎల్కలపల్లి గేట్ గ్రామపంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేశారు. దీంతో కార్పొరేషన్ విస్తీర్ణం 93.87 చదరపు కిలో మీటర్ల నుంచి 99.5చదరపు కిలోమీటర్లకు పెరిగింది. ఓటర్ల సంఖ్య 1.78లక్షలుగా ఉంది. డివిజన్ల పునర్విభజనకు ప్రభుత్వం జీవో ఆర్‌టీ నెం.269 జారీ చేసింది. 1,78,000ఓటర్లను 60డివిజన్లుగా విభజిస్తున్నారు. ఒక్కో డివిజన్‌కు 2,800 నుంచి 3100ఓటర్లు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు కసరత్తు పూర్తయ్యింది. మార్కం డేయకాలనీ, కేసీఆర్ కాలనీ, శారదానగర్ తదితర అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య పెరగడంతో 25, 26డివిజన్లుగా ఉన్న ఈ ప్రాంతాల్లో అదనంగా మరో డివిజన్‌గా విభజిస్తున్నారు. ఎన్‌టీపీసీ టౌన్‌షిప్‌లో ఓటర్ల సంఖ్య తగ్గుతుండడంతో అదనంగా కాజిపల్లిని చేరుస్తున్నారు. ఇలా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు, విలీన గ్రామాల పరిధిలో డివిజన్ల సంఖ్య పెరుగుతుంది. రామ గుండం, యైుటింక్లయిన్‌కాలనీ ప్రాంతాల్లో డివిజన్లు పెరుగుతు న్నాయి. కార్పొరేషన్ పరిధిలో ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు భౌగోళికంగా దూరం ఉన్న ప్రాంతాలను, పక్కనే ఉన్న డివిజన్లలో కలిపేందుకు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా సింగరేణి కాల నీలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వ ఆదేశానుసారం బుధవారం డివిజన్ల పునర్విభజనకు సంబంధించి గెజిట్ విడుదల కానున్నది. ఈ మేరకు మంగళవారం రాత్రి రామగుండం నగర పాలక సంస్థ ప్రభుత్వానికి నివేదించనున్నది. జూన్ 5 నుంచి 11వరకు ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి సలహాలు స్వీకరిస్తారు. 12 నుంచి 16వరకు ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలు, ఫిర్యాదు లను పరిష్కరిస్తారు. జూన్ 17, 18 తేదీల్లో కలెక్టర్ తుది జాబితాను ప్రచురించి మున్సిపల్ డైరెక్టర్‌కు నివేదిస్తారు.
డివిజన్ల పునర్విభజనతో
ఆశావాహుల్లో అయోమయం...
రామగుండం నగరపాలక సంస్థలో డివిజన్ల పునర్విభజనతో ఆశావాహుల్లో అయోమయం నెలకొన్నది. ఇప్పటి వరకు మాజీ కార్పొరేటర్లు, నాయకులు తమ ప్రాంత డివిజన్లు తామే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఏ బ్లాక్ ఎటు పోతుందో, ఏ ఇండ్లు ఏ డివిజన్లకు మారుతాయో అర్థంకాక అయోమయానికి గురవుతున్నారు. పునర్విభజన తరువాత పరిస్థితులు, రిజర్వేషన్లు అనుకూలిస్తేనే పోటీ చేసేందుకు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.