జిల్లా ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు
ABN , Publish Date - Oct 16 , 2025 | 11:44 PM
జిల్లా ఆస్పత్రిలో 24 గంటలు మెరుగైన వైద్యసే వలు అందుతున్నాయని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. గురువారం జిల్లా ఆస్పత్రిని సందర్శించి నూతనంగా నిర్మిస్తు న్న ఆస్పత్రి భవన పనులను పరిశీలించిన అనం తరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలి సారిగా రోజు ఒక్కో రకం రంగు బెడ్ షీట్ లను వినియోగించడం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రా రంభిస్తున్నట్టు తెలిపారు.
పెద్దపల్లిటౌన్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) జిల్లా ఆస్పత్రిలో 24 గంటలు మెరుగైన వైద్యసే వలు అందుతున్నాయని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. గురువారం జిల్లా ఆస్పత్రిని సందర్శించి నూతనంగా నిర్మిస్తు న్న ఆస్పత్రి భవన పనులను పరిశీలించిన అనం తరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలి సారిగా రోజు ఒక్కో రకం రంగు బెడ్ షీట్ లను వినియోగించడం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రా రంభిస్తున్నట్టు తెలిపారు. వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతోందన్నారు. సెప్టెంబరులో 250 మంది గర్భిణిలకు ప్రసూతి సేవలు అందించారని, 123 మందికి టిఫా స్కా నింగ్ చేశారని, 316 మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందించి ప్రైవేట్‌కు దీటుగా వైద్యసేవలు అందిం చామన్నారు. ప్రసవాలు పెరిగాయని,ఇతర జిల్లాల నుంచి వైద్యానికి ఇక్కడికి వస్తున్నారన్నారు.
వెం టిలేటర్లు, సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ పరికరాలను అం దుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఎమ్మెల్యే తెలి పారు. రోగులు అసంతృప్తితో ఉండకూడదని ఉద్దేశ్యంతో పని చేస్తున్న సిబ్బందికి డీసీహెచ్ శ్రీధర్‌కు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా వైద్య శాఖ అధికారులు, డాక్టర్స్ మార్కెట్ చైర్మన్లు, భూతగడ్డ సంపత్ శ్రీనివాస్. సయ్యద్ మస్రత్, సుభాష్, కలవేన మహేందర్, జగదీష్ పాల్గొన్నారు.