ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ స్పందన అవసరం
ABN , Publish Date - Jul 22 , 2025 | 11:47 PM
పోలీస్‌స్టేషన్లకు వచ్చే ప్రజల సమస్యలపై వెంటనే స్పందించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం సీపీ సందర్శించారు. అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
ఓదెల, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : పోలీస్‌స్టేషన్లకు వచ్చే ప్రజల సమస్యలపై వెంటనే స్పందించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం సీపీ సందర్శించారు. అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. సీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో బాధ్యతాయుతంగా పనిచేసిన వారికే గుర్తింపు, రివార్డులు ఉంటాయని తెలిపారు. స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ నిర్వహిస్తు నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. గంజాయి రవాణ, వినియోగాన్ని నిరోధించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు జరగకుండా, ఎవరు దానికి గురికాకుండా అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్‌స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను, రికార్డులను పరిశీలించారు.
మండలంలోని భౌగోళిక పరిస్థితులు, మావోయిస్టుల వారి కుటుంబాల వివరాలను తెలుసుకున్నారు. మండలంలో జరుగుతున్న నేరాలు, వాటిని ఎలా నియంత్రిస్తున్నారనే అంశాలపై పరిశీలించారు. ప్రజల ఫిర్యాదుల పై పారదర్శకంగా ఉండాలని అధికారులకు, పోలీస్ సిబ్బందికి సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలను నాటారు. ఇన్‌చార్జి ఏసీపీ శ్రీనివాస్, సీఐ సుబ్బారెడ్డి, ఎస్‌ఐలు రమేష్, వెంకటేష్, సిసి హరీష్ పాల్గొన్నారు.