Share News

పొగాకు వినియోగంతో అనారోగ్యం

ABN , Publish Date - May 31 , 2025 | 11:30 PM

పొగాకు వినియోగం ప్రమాదకరమని గోదావరిఖని అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి డాక్టర్‌ టీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం పురస్క రించుకుని మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వ ర్యంలో కోర్టు సిబ్బందికి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

పొగాకు వినియోగంతో అనారోగ్యం

కోల్‌సిటీ, మే 31 (ఆంధ్రజ్యోతి): పొగాకు వినియోగం ప్రమాదకరమని గోదావరిఖని అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి డాక్టర్‌ టీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం పురస్క రించుకుని మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వ ర్యంలో కోర్టు సిబ్బందికి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా యేటా లక్షలాది మంది కేన్సర్‌ బారిన పడు తున్నారన్నారు. పొగాకు వినియోగించడం వల్ల కేన్సర్‌కు గురై మరణాలు సంభవిస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ పొగాకు దుష్ప్రరిణామాలపై అవగాహన పెంచుకోవా లని సూచించారు. రెండవ అదనపు మున్సిఫ్‌ మెజిస్ర్టేట్‌ వెంకటేష్‌ గురువ, అదనపు జిల్లా న్యాయస్థాన పరి పాలనాధికారి శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్లు శ్రీధర్‌, విజయసారధి, లూర్థు పాల్గొన్నారు.

రామగిరి, (ఆంధ్రజ్యోతి): ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం పురస్కరించుకొని బేగంపేట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఇల్లటం ప్రదీప్‌ కుమార్‌ ఆధ్వ ర్యంలో గ్రామంలో ర్యాలీ చేపట్టారు. పొగాకు సేవనం ద్వారా జరిగే అనారోగ్య సమస్యలపై గ్రామంలో అవగా హన కల్పిస్తూ పొగాకు దూరంగా ఉండాలని సూచిం చారు. తొలుత పొగాకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయిం చారు. సిహెచ్‌వో భరత్‌, హెచ్‌ఈ సీతారామయ్య, హెచ్‌వి పుష్పలత, ల్యాబ్‌ టెక్నీషియన్‌ శ్రీనివాస్‌, ఏఎన్‌ ఎం మనమ్మ, స్టాఫ్‌నర్సులు రమాదేవి, స్వప్న, ఉమాదేవి పాల్గొన్నారు.

ఓదెల, (ఆంధ్రజ్యోతి): కొలనూర్‌ ప్రభుత్వ ఆసుప త్రిలో పొగాకు వ్యతిరేక దినంలో భాగంగా శనివారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం పొగాకును నిషేధించా లని, పొగాకుకు బానిసలు అయితే కేన్సర్‌ బారిన పడి మరణిస్తారని తెలిపారు. అనంతరం వైద్య సిబ్బంది ప్రతిజ్ఞ నిర్వహించారు. డాక్టర్‌ సంజనేష్‌ కుమార్‌ తో పాటు ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): పొగాకు వాడకాన్ని తగ్గించి అనారోగ్య సమస్యలను అధిగమించాలని పీహెచ్‌సీ వైద్యురాలు నిస్సిక్రిష్టాన అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం నిర్వహించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్‌చౌక్‌లో స్లోగన్స్‌ చేశారు. పొగాకు వల్ల చాలా అనర్ధాలు కలుగుతాయని కేన్సర్‌, టీబీ ఇతరత్రా దీర్ఘకా లిక వ్యాధులు సంక్రమిస్తాయని తెలిపారు. ఆయుష్‌ వైద్యులు కేశవరెడ్డి, సూపర్‌వైజర్‌ నాగమణి, ఏఎన్‌ ఎంలు, ఆశాలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2025 | 11:30 PM