అక్రమ నిర్మాణాలను తొలగించాలి
ABN , Publish Date - Oct 27 , 2025 | 11:42 PM
ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఓదెల మం డలం జీలకుంట గ్రామానికి చెందిన దార సతీష్ అదనపు కలెక్టర్ డి వేణుకు విజ్ఞప్తి చేశారు. ఆయన తహసీల్దార్‌ను విచార ణకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
పెద్దపల్లి, అక్టోబర్ 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఓదెల మం డలం జీలకుంట గ్రామానికి చెందిన దార సతీష్ అదనపు కలెక్టర్ డి వేణుకు విజ్ఞప్తి చేశారు. ఆయన తహసీల్దార్‌ను విచార ణకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామానికి చెందిన మావోయిస్టు మంథని లక్ష్మీ అలి యాస్ సంధ్యకు పునరావాసం కింద గ్రామశివారు సర్వే నెంబర్ 309లో 5 ఎక రాల భూమి కేటాయించి పట్టా ఇప్పించా లని దరఖాస్తు చేసుకొన్నారు. ప్రతిపాద నలు తయారు చేయాలని అధికారులకు రాశారు.
తన బాగోగులు పట్టించుకోకుండా ఇంటిలో నుంచి గెంటేసిన కుమారుడు శ్రీధర్‌పై తల్లిదండ్రులు, వృద్ధులు పోషణ సంక్షేమ చట్టం కింద చర్యలు తీసుకొని ఇల్లు ఇప్పించాలని రామగుండం మండ లం వీర్లపల్లి గ్రామానికి చెందిన భోజరాజు దరఖాస్తు చేసుకోగా రెవెన్యూ డివిజన్ అధికారికి రాస్తూ చర్యలు చేపట్టాలన్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కమాన్ వాడకు చెందిన వేణుమాధవ్ కమర్షియల్ ఏరియా వెనుక చిత్తడిగా ఉందని, పాము లు ఇళ్లల్లోకి వస్తున్నాయని, శుభ్రం చేయిం చాలని దరఖాస్తు చేసుకోగా మున్సిపల్ కమిషనర్‌కు రాశారు. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వేణు జిల్లా అధికారులను ఆదేశించారు.