కాంగ్రెస్‌ను నమ్మితే బీసీలను నట్టేట ముంచారు
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:48 PM
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నట్టేట ముంచిందని, కాంగ్రెస్ పార్టీ నయవంచన అని మాజీ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాడు అధికారం కోసం బీసీ వాదాన్ని ఎత్తుకున్న కాంగ్రెస్, నేడు నమ్మించి మోసం చేసిందన్నారు.
గోదావరిఖని, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నట్టేట ముంచిందని, కాంగ్రెస్ పార్టీ నయవంచన అని మాజీ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాడు అధికారం కోసం బీసీ వాదాన్ని ఎత్తుకున్న కాంగ్రెస్, నేడు నమ్మించి మోసం చేసిందన్నారు. బీసీ రిజర్వేషన్లపై 22నెలలుగా మసిబూసిమారేడు కాయ చేసి నిండా ముంచిందన్నారు. ఆరు గ్యారంటీల తరహాలోనే 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్టబద్దత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన రేవంత్‌రెడ్డ్డి తెలివిగా దాన్ని పక్క దోవ పట్టించారని, బీసీల పట్ల తమకు నిజంగానే ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు జీఓ ఇచ్చి కొత్త నాటకానికి తెరతీశారన్నారు. రాజ్యాంగ సవరణ లేకుండా అసెంబ్లీ తీర్మానంతో కోటా రాదని విపక్షాలు, విద్యావంతులు చెప్పినా వినకుండా ఎన్నికల నోటిఫికేషన్ దాకా తెచ్చి చివరకు కోర్టు ముందు చేతులెత్తేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42శాతం పెంపు విషయమై ఢిల్లీలో కొట్లాడాలని చెప్పారు. నాయకులు గోపు అయులయ్య యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్‌రావు, మాజీ జెడ్‌పీటీసీ ఆముల నారాయణ, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు బొడ్డు రవీందర్, కల్వచర్ల కృష్ణవేణి, నారాయణదాసు మారుతి, నూతి తిరుపతి, మేతుకు దేవరాజ్, చల్లా రవీందర్‌రెడ్డి, మేడి సదానందం, పిల్లి రమేష్, తోకల రమేష్, సట్టు శ్రీనివాస్, బండారి ప్రవీణ్, ఆర్శనపల్లి శ్రీనివాస్, యాసర్ల తిమోతి, వెంకటేష్, ముద్దాసాని సంధ్యారెడ్డి, సాయి కుమార్ (చింటూ), కోడి రామకృష్ణ, ఆవునూరి వెంకటేష్, బచ్చాల రాములు, గుర్రం పద్మ, ఓదెలు పాల్గొన్నారు.