అగ్ని ప్రమాదాలు సంభవిస్తే అంతే సంగతులు
ABN , Publish Date - Mar 09 , 2025 | 12:58 AM
చిన్న తప్పిదంతో అగ్ని ప్రమాదాలు సంభవించి ఆస్తి, ప్రాణ నష్టం చోటుచేసుకుంటోంది. మార్చిలోనే ఎండల తీవ్రత పెరి గింది. వేసవిలో అగ్ని ప్రమాదాలు అధికంగా సంభవి స్తాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదముంది. భూగర్భ జలాలు అడుగంటడంతో అగ్ని ప్రమాదాలను నివారించడం సవాల్‌గా మారింది.

మంథని, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): చిన్న తప్పిదంతో అగ్ని ప్రమాదాలు సంభవించి ఆస్తి, ప్రాణ నష్టం చోటుచేసుకుంటోంది. మార్చిలోనే ఎండల తీవ్రత పెరి గింది. వేసవిలో అగ్ని ప్రమాదాలు అధికంగా సంభవి స్తాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదముంది. భూగర్భ జలాలు అడుగంటడంతో అగ్ని ప్రమాదాలను నివారించడం సవాల్‌గా మారింది. జిల్లాలో 16 మండలాలు ఉండగా పెద్దపల్లి, మంథని, గోదావరిఖనిల్లో మూడు ఫైర్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నవాటిలో కొన్ని ఫైర్ ఇంజన్లు, ఇతర సామగ్రి సరిగ్గా లేవు. ఫైర్ సిబ్బంది కొరత వేధిస్తోంది. ఫైర్‌మెన్ ఖాళీ పోస్టులను హోంగార్డుల డిప్యూటేషన్‌తో భర్తీ చేశారు.
ప్రస్తుతం ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, మానేరు నదిలో నీరు ఇంకిపోవడం మొదలైంది. గ్రామాలు, పట్టణాల్లోని బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదం ఉంది. అగ్ని ప్రమాదాల్లో ఇండ్లు, షాపులు, విలువైన సామగ్రి, నగదు, సర్టిఫికెట్ల లాంటివి బూడిద పాలుకావడంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణ నష్టం సంభవించే అవకాశముంది. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడమే దావాగ్నికి అడ్డుకట్ట పడే అవకాశముంది. ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే 101కు కాల్ చేసి చిరునామా, స్పష్టమైన వివరాలు తెలియజేస్తే అగ్ని మాపక సిబ్బంది సకాలంలో అక్కడికి వచ్చి ప్రమాదాలను నివారిస్తారు. ఇప్పటికే అగ్ని ప్రమాదాల నివారణ కోసం చేపట్టాల్సిన చర్యలపై యేటా ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఇరుకు ప్రదేశాల్లో మిస్డ్‌బుల్లెట్ సేవలు..
అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తక్షణమే స్పందించి వేగంగా సంఘటన స్థలానికి చేరుకోవడానికి వీలుగా ప్రభుత్వం మిస్డ్ బుల్లెట్ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అందులో భాగంగా జిల్లాలోని మూడు అగ్నిమాపక కేంద్రాలకు ఒక్కొక్క మిస్డ్ బుల్లెట్ వాహనాన్ని కేటాయించారు.
ఫైర్‌స్టేషన్లలో ఉద్యోగుల కొరత..
జిల్లాలోని మూడు ఫైర్‌స్టేషన్లలో సిబ్బంది కొరత ఉంది. మంథని, గోదావరిఖని, పెద్దపల్లి ఫైర్ స్టేషన్లలో డ్రైవర్ల, ఫైర్‌మెన్లు లేరు. హోంగార్డులతో సేవలు తీసుకుంటున్నారు. జిల్లాలోని మరే ఇతర ప్రాంతాల్లో నూతన ఫైర్ స్టేషన్ల ఏర్పాటుకు ఇప్పటి వరకు ప్రతిపాదనలు లేవు.
మంథనిలో నీటి వసతి లేక ఇబ్బందులు..
మంథనిలోని ఫైరింజన్‌ను నింపుకోవటానికి నీటి వసతి లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఫైర్ స్టేషన్‌లో ఉన్న బోరుకు మోటార్ కెపాసిటీ సరిపోక ఫైరింజన్ నింపడానికి వీలు కావడం లేదు. దీంతో ఉద్యోగులు ఫైరింజన్‌ను నింపుకోవటానికి మండలంలోని గుంజపడుగు, అడవిసోమన్‌పల్లి ప్రాంతాలకు వెళ్ళి ట్యాంక్ ఫుల్ చేసుకొని వస్తున్నారు. ఏదైన అగ్ని ప్రమా దం సంభవిస్తే ఒక్కసారి ఫైరింజన్‌లోని ట్యాంక్‌లో నీరు అయిపోతే మళ్ళీ నింపుకొనిరావడం చాలా కష్టం. ఈలోగా నష్టం జరిగే ప్రమాదం ఉంది. మంథని పట్టణంలో ఫైరింజన్‌కు ట్యాంక్ నింపుకునేలా అధికా రులు నీటి వసతి ఏర్పాటు చేయాలి.
గుంజపడుగు అగ్ని ప్రమాదంలో నగదు దగ్ధం
గుంజపడుగు గ్రామంలో గత నెల 26న అర్ధరాత్రి దాటిన తర్వాత షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన అగ్ని ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టంతోపాటు లక్షలాది రూపాయల నగదు అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామానికి చెందిన ఊదరి శివశంకర్‌కు చెందిన కిరాణ, జనరల్ స్టోర్ షాపులో రాత్రి సంభవించిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దాదాపు 20 లక్షల పైగా ఆస్తి నష్టంతోపాటు ఇంటి నిర్మాణం కోసం అప్పుగా తీసుకున్న రూ.7 లక్షల నగదు సైతం దగ్ధమైంది.
గృహాల్లో జరిగే అగ్ని ప్రమాదాలు
పిల్లలకు అగ్గి పెట్టేలు, లైటర్లు, టపాకాయలు, మండే పదార్థాలను అందుబాటులో ఉంచకూడదు. కాల్చిన సిగరేట్లు, బీడీలు, అగ్గి పుల్లలను ఆర్పివేయకుండా పడవేయవద్దు. ఇంట్లోని వైరింగ్‌లో ఐఎస్‌ఐ కల్గి ఉన్న ఎలక్ర్టికల్ వస్తువులను వినియోగించాలి. సాకేట్‌లో దానికి కెపాసిటికీ తగిన ఫ్లగ్‌లను మాత్రమే వాడాలి. ఎక్కువ రోజులు ఊరికి వెళ్తే మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఎప్పుడూ ఇంట్లో నీరు నిల్వ ఉండే విధంగా, వంట గదుల్లో వెలుతురు ఉండే విధంగా చూడాలి. గ్యాస్ ట్యూబ్‌లను ఈఎస్‌ఐ మార్క్ ఉన్న వాటినే వాడాలి. గ్యాస్ సిలిండర్ వినియోగం తరువాత రెగ్యులేటర్ ఆపివేయాలి, గ్యాస్ లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వంటగదిలో కిరోసిన్ పెట్రోల్, డిజీల్, అదన పు గ్యాస్ సిలిండర్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
స్కూల్స్, షాపింగ్ మాల్స్ జాగ్రత్తలు..
ఫైర్ అల్లారం, ఫైర్ స్మోక్ డిటెక్టర్లను అవసరమున్న ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాలి. సెల్లర్లలో ఆటోమెటిక్ స్పింకర్స్‌ను, ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా బయటపడాలో తెలిసే విధంగా ఏర్పాట్లు చేయాలి. బయటికి వచ్చే మార్గాల్లో మెట్లు, తలుపుల వద్ద ఎలాంటి ఆటం కాలు లేకుండా చర్యలు తీసుకోవాలి. ఎలక్ర్టికల్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా మినీ పీహెచ్‌ఆర్ సర్క్యూట్ బ్రేకర్స్‌ను అమర్చాలి. ఫైర్ ఎనాక్యుయేషన్ డ్రిల్లులను ప్రతి మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా పరిశీలించాలి.
గోదాములు, గిడ్డంగుల్లో
స్టాక్‌ను చెక్క స్లీపర్లపైన మాత్రమే నిల్వ చేయాలి. వివిధ రకాల వస్తువులను వేర్వేరుగా భద్రపరచాలి. నిల్వ మఽధ్యలో గ్యాంగ్‌వే లేదా క్రాస్ సెక్షన్లను ఉంచాలి. వస్తువులను 4.5 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో నిల్వ చేయవద్దు. పైకప్పు స్లాబ్‌కు మధ్యలో కనీసం రెండు అడుగుల దూరం ఉండాలి. వస్తువులు ఎత్తడం, దించే సమయాల్లో వాహనాల్లోని ఇంజన్లను ఆపి వేయాలి. తగినంత గాలి, వెలుతురు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.
గ్రామీణ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు
ఎండిన గడ్డిని మాత్రమే వాములుగా పేర్చాలి. వీటిని నివాస గృహాలకు 60 అడుగుల దూరంలో నిల్వ చేయాలి. పెద్ద పెద్ద గడివాములకు బదులు, చిన్న చిన్న గా ఏర్పాటు చేసుకోవాలి. గడివాముల మధ్య ఖాళీ స్థలం ఉండే విధంగా చూడాలి. గుడిసెల మధ్య కూడా 30 అడుగుల దూరాన్ని పాటించాలి. వంట పొయ్యిలను పడుకునే ముందు ఆర్పే విధంగా జాగ్రత్త పడాలి.
ప్రమాదాలు జరిగినప్పుడు ఏం చేయాలి..
ఫ విద్యుత్ ప్రమాదాలు సంభవించినప్పుడు నీటిని వినియోగించరాదు.
ఫ పొడి ఇసుకను మాత్రమే ప్రమాదాల వినియోగించాలి.
ఫ విద్యుత్ మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేసిన తరువాత మాత్రమే ఫైర్‌ను ఆర్పడానికి ప్రయత్నించాలి.
ఫ విద్యుత్ సరఫరా ఉన్న వైర్లపై అత్యవసర పరిస్థితుల్లో కార్భన్ డయాక్సైడ్ ఎక్స్‌ట్వింగిషర్‌ను ఉపయోగించాలి.
ఫ అగ్ని ప్రమాద సిబ్బందికి సమాచారమందించాలి.