యాదవుల సంక్షేమానికి కృషి చేస్తా
ABN , Publish Date - Aug 17 , 2025 | 11:57 PM
యాదవుల సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. శనివారం రాత్రి గోదావరిఖని చౌరస్తాలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిం చిన శ్రీకృష్ణాష్టమి వేడుకలకు ఎస్‌సీ, ఎస్‌టీ జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్‌తో కలిసి కృష్ణున్ని చిత్రపటాన్ని ఆవిష్కరించారు.
కళ్యాణ్‌నగర్, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): యాదవుల సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. శనివారం రాత్రి గోదావరిఖని చౌరస్తాలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిం చిన శ్రీకృష్ణాష్టమి వేడుకలకు ఎస్‌సీ, ఎస్‌టీ జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్‌తో కలిసి కృష్ణున్ని చిత్రపటాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణుడు అందరికి మార్గద ర్శకుడని, ఆయన సూచించిన బాటలో నడవాల న్నారు. వడ్డేపల్లి రాంచందర్ మాట్లాడుతూ కృష్ణుని మార్గంలో నడిచినప్పుడే శాంతి కలుగుతుందని, ఆయన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఎమ్మె ల్యే సతీమణి మనాలీ ఠాకూర్ ఆధ్వర్యంలో మహి ళలు కోలాట నృత్యాన్ని ప్రదర్శించారు.
అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇస్కాన్ బృం దం ఆధ్వర్యంలో మహిళలు సాంస్కృతిక కార్యక్రమా లను నిర్వహించారు. యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాతపెల్లి రవి ఆధ్వర్యంలో జరిగిన కార్య క్రమంలో కాల్వ లింగస్వామి, ఏసీపీ మడత రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనా రెడ్డి, మెండె లింగయ్య, మేకల పోషం, ఐలయ్య యాదవ్, చుక్కల శ్రీనివాస్, మధు పాల్గొన్నారు.