Share News

జాబ్‌ మేళాకు భారీ స్పందన

ABN , Publish Date - Sep 20 , 2025 | 12:17 AM

జిల్లా కేంద్రంలోని టాస్క్‌ సెంటర్‌లో నిర్వహించిన జాబ్‌ మేళాకు విశేష స్పందన లభించినట్లు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం టాస్క్‌ సెంటర్‌లో జరుగుతున్న ఇంట ర్య్వూల తీరును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ టెలిఫెర్మార్మెన్స్‌ కంపెనీ వారు నిర్వహించిన ఈ మేళాలో 117 మంది విద్యార్థులు పాల్గొనగా, 27 మంది ఎంపిక కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

జాబ్‌ మేళాకు భారీ స్పందన

పెద్దపల్లి కల్చరల్‌, సెప్టెంబరు19(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని టాస్క్‌ సెంటర్‌లో నిర్వహించిన జాబ్‌ మేళాకు విశేష స్పందన లభించినట్లు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం టాస్క్‌ సెంటర్‌లో జరుగుతున్న ఇంట ర్య్వూల తీరును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ టెలిఫెర్మార్మెన్స్‌ కంపెనీ వారు నిర్వహించిన ఈ మేళాలో 117 మంది విద్యార్థులు పాల్గొనగా, 27 మంది ఎంపిక కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇందులో ఎంపికైన వారికి శిక్షణ అందించి ఉపాధి కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ జాబ్‌ మేళా కార్యక్రమంపై టాస్క్‌ కోఆర్డినేటర్‌ కౌసల్యను వివరాలు తెలుసుకున్నారు. కంపెనీ ప్రతినిధులతోపాటు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు, అధికారులు పాల్గొన్నారు.

పోక్సో బాధితులకు అండగా పని చేయాలి

పెద్దపల్లి కల్చరల్‌, సెప్టెంబరు19(ఆంధ్రజ్యోతి): పోక్సో బాధితులకు అండగా అధికార యంత్రాంగం పని చేయాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పోక్సో యాక్ట్‌, జువెనల్‌ జస్టిస్‌ యాక్ట్‌పై పోలీస్‌, సంక్షేమశాఖ నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలికలపై లైంగిక దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించేందుకు, వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ యాక్టు ప్రవేశ పెట్టిందన్నారు. బాలికలు భయంతో లైంగికదాడులు జరిగితే తల్లితండ్రులకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారని, వారిలో ధైర్యం కల్పించి నిఽందితులకు కఠినశిక్ష పడేలా అధికార యంత్రాంగం పని చేయాలన్నారు. బాధితులకు మనోధైర్యం కల్పించాలన్నారు. పోక్సో యాక్టు గురించి ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం మాదక ద్రవ్యాల వినియోగ నష్టాలపై ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. డీసీపీ కరుణాకర్‌, జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్‌, ఏసీపీ కృష్ణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2025 | 12:17 AM