Share News

ఆశ వర్కర్లు పోరాటాలు ఉధృతం చేయాలి

ABN , Publish Date - Sep 12 , 2025 | 12:05 AM

ఆశ వర్కర్లు సమస్యల పరిష్కారానికి పోరాటాలు ఉధృతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూని యన్‌( సిఐటియు) జిల్లా నాలుగవ మహాసభలు జిల్లా కేంద్రంలో నిర్వహించారు.

ఆశ వర్కర్లు పోరాటాలు ఉధృతం చేయాలి

పెద్దపల్లిటౌన్‌, సెప్టెంబరు 11 (ఆంఽధ్రజ్యోతి) ఆశ వర్కర్లు సమస్యల పరిష్కారానికి పోరాటాలు ఉధృతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూని యన్‌( సిఐటియు) జిల్లా నాలుగవ మహాసభలు జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా భూపాల్‌ హాజరై మాట్లాడారు. 19 ఏళ్ళుగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లు తీవ్ర ఇబ్బందు పడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కనీస వేతనం 18 వేలు చెల్లిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నేరవేర్చే వరకు ఉద్యమాలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఆశా వర్కర్లకు పెండింగ్‌లో ఉన్న బిల్స్‌ వెంటనే చెల్లించే విధంగా కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి.జ్యోతి, ఎరవెల్లి ముత్యంరావు, టి శారద కే రూపా రాణి సువర్ణ, సరోజన స్వప్న ఈ శివ లీల సునీత అమృత విజయ పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 12:05 AM