Share News

ఇంటింటా పౌష్టికాహారం

ABN , Publish Date - Sep 16 , 2025 | 12:59 AM

సంపూర్ణ ఆరోగ్యం కోసం పౌష్టికాహారంపై ఇంటింటా అవగాహన కల్పిస్తున్నారు. ఇంటింటా పోషణ సంబరా లలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్రీయ పోషణ మాసోత్సవంలో భాగంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

ఇంటింటా పౌష్టికాహారం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

సంపూర్ణ ఆరోగ్యం కోసం పౌష్టికాహారంపై ఇంటింటా అవగాహన కల్పిస్తున్నారు. ఇంటింటా పోషణ సంబరా లలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్రీయ పోషణ మాసోత్సవంలో భాగంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పోషకాహార లోపంతో ఉన్నవారిని గుర్తించ డంతో పాటు గర్భిణీలు, బాలింతల్లో పోషకాహారం పట్ల అవగాహన కల్పిస్తూ ర్యాలీలు సదస్సులు నిర్వహించను న్నారు. జిల్లాలో ప్రతి సంవత్సరం సెప్టెంబరులో జరిగే పోషణ్‌ మాసోత్సవం నిర్వహిస్తారు. ఈ సారి కాస్త ఆలస్యంగా ఈ నెల 17 నుంచి అక్టోబరు 16 వరకు పోషన్‌ మాసోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. గర్భిణీలు, మెట్టినిల్లు, పుట్టినింట్లో ఎక్కడా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో తమ పేర్లు నమోదు చేసుకుని పౌష్టికాహారం పొందే విధంగా అవగాహన కల్పిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారంతో పాటు వారి పర్యవేక్షణను అంగన్‌వాడీ టీచర్లు, అశాలు, ఏఎన్‌ఎంలు గృహా సందర్శనలు చేపట్టి సమాచారాన్ని సేకరిస్తారు. ఆరు సంవత్సరాలుగా సెప్టెంబరులో నిర్వహించే పోషణ్‌ మాసోత్సవం కార్యక్రమంలో జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల పరిధిలో 587 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో 39,723 మంది పౌష్టాకాహారం పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో గర్భిణీలు 3,682 మంది, 2,778 మంది బాలింతలు ఉన్నారు. వీరితో పాటు 3 సంవత్సరాల లోపు పిల్లలు 17,487 మంది, 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు 15,744 మంది ఉన్నారు. పిల్లల ఎత్తు, బరువు ద్వారా పోషణలోపం, తీవ్ర పోషణ లోపాన్ని గుర్తించి ఆన్‌లైన్‌ చేస్తారు. పోషకాహారం సంబంధించి పిల్లల కోసం పోషణ్‌ ట్రాకర్‌ యాప్‌లో వివరాలను పొందుపరుస్తారు. పోషణ పురోగతిని ఎప్పటికప్పుడు అంగన్‌వాడీలు అన్‌లైన్‌లో నమోదు చేస్తారు. పోషకాహార లోపం ఉంటే అదనపు పోషకా హారాన్ని అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, గురుకులాలు, ఇంటర్‌, హైస్కూల్‌ విద్యార్థులకు రక్తహీనత నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఇప్పటికే పోషణమాసంలో భాగంగా అవగా హన కార్యక్రమాలు చేపట్టారు. అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తు న్నారు. పోషణ ప్రతిజ్ఞ చేస్తున్నారు.

నాలుగు వారాలు ప్రత్యేక కార్యక్రమాలు

గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాలను గుర్తించి వాటిని నివారించే దిశగా నాలుగు వారాల పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించను న్నారు. పిల్లల ప్రత్యేక పెరుగుదల పర్యవేక్షణపై డ్రైవ్‌ నిర్వహిస్తారు. చిన్నారుల బరువు, కొలతలు వివరాలు తీసుకుంటారు. ఎన్‌హెచ్‌టీఎన్‌లో నమోదు చేయడంతో పాటు పోషణ్‌ ట్రాకర్‌లో పొందుపరుస్తారు. చిన్నారు లకు టీకాలు, గర్భిణీలకు పరీక్షలు చేయించడం, టేక్‌ హోం రేషన్‌, ఐరన్‌ మాత్రలతో పాటు అనుబంధ పోషకాహారాలను అందిస్తారు. చిన్నారుల బరువు చూడడం, పోషకాహారానికి పెరటి తోటల పెంపకం, విటమిన్‌ సీ అఽధికంగా ఉండే పండ్ల మొక్కలు పెంచ డం, అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఐదేండ్లలోపు పిల్లలందరికీ పెరుగుదల పర్యవేక్షణ చేస్తారు. గర్భిణీలను నమోదు చేయడం, అన్నప్రాసన, అక్షరా భ్యాసం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కిశోర బాలి కలకు రక్త పరీక్షలు చేయడం, పోషకాహారంపై అవగా హన కార్యక్రమాలు చేపడుతారు. చిన్నారులకు టీకాలు, గర్భిణీలకు బరువులు చూడడం, పరీక్షలు చేయడం, పోషకాహారంతో పాటు తల్లిపాల అవశ్యకతపై అవగాహన కల్పించడం, ర్యాలీలు, అ వగాహన కార్యాక్రమాలను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి చేయడం, పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు చేపడు తారు. పోషకాహారం తీసుకునే సమయంలో శుభ్రత పాటించడం, పోషకాహారంపై ఇతర విద్యార్థులను ప్రోత్సహించడం, ప్రార్థన సమయంలో పోషకాహారంపై సందేశాలు ఇవ్వడం, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించడం వంటివి చేస్తారు. చేతులు శుభ్రంగా ఉంచుకోవడంపై అవగాహన కల్పిస్తారు.

ప్రత్యేక కార్యక్రమం

ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక అంశాన్ని తీసుకొని పోషణ్‌ మాసోత్సవం ప్రచారం చేస్తారు. రాష్ర్టీయ పోషణ్‌ మాసోత్సవంలో ఈ సంవత్సరం 2025లో ఊబకా యాన్ని పరిష్కరించడం, చక్కెర, నూనె విని యోగాన్ని తగ్గించడం అనే థీమ్‌లో అవగాహన పెంచ డం, ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించడం ద్వారా పోషకార లోపం పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. మాసోత్సవ నిర్వహణకు ప్రభుత్వం ఐసీడీఎస్‌ ప్రాజెక్టుకు రూ. 30 వేలు, జిల్లాకు రూ 50 వేల నిధులు విడుదల చేసింది.

Updated Date - Sep 16 , 2025 | 12:59 AM