ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:54 PM
ఆయిల్ పామ్ సాగు ద్వారా అధిక లాభాలు పొందవచ్చని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. సోమవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారోత్సవాల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పంట మార్పిడితోనే అధిక దిగుబడి సాధ్యమవు తుందన్నారు.
ఎలిగేడు, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ఆయిల్ పామ్ సాగు ద్వారా అధిక లాభాలు పొందవచ్చని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. సోమవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారోత్సవాల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పంట మార్పిడితోనే అధిక దిగుబడి సాధ్యమవు తుందన్నారు. ప్రతిసారి వరిపంట వేయడం వల్ల భూమిలో సారం తగ్గి, ఎరువులపై ఆధారపడి రోగాల బారిన పడే అవకాశం పెరుగుతుందన్నారు. సారవంత మైన భూములు సౌడు భూములుగా మారుతున్నా యని, దీని కోసం సేంద్రియ ఎరువులను వాడాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఆయిల్ పామ్ సాగు కోసం సబ్సిడీతో కూడిన డ్రిప్‌ను 90 శాతం ఇస్తుందన్నారు. చీడపీడల బెడద ఉండదని, తుఫాన్‌కు తట్టుకొని మంచి ఆదాయాన్ని పొందవచ్చని అన్నారు. పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులను అందించారు. పీఏసీఎస్ చైర్మ న్‌లు గోపు విజయభాస్కర్ రెడ్డి, పుల్లూరి వేణుగోపాల్ రావు, ఏడీఏ శ్రీనాథ్, హార్టికల్చర్ శాస్త్రవేత్త భాస్కర్ రావు, తహసీల్దార్ యాకన్న, ఎంపీడీఓ భాస్కర్ రావు, ఏఓ ఉమాపతి, అసిస్టెంట్ రిజిష్టర్ అనిల్‌కుమార్, మానిటరింగ్ అధికారి స్రవంతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్‌రెడ్డి, దుగ్యాల సంతోష్‌రావు, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ధర్మారం, (ఆంధ్రజ్యోతి): ఆయిల్ పామ్ పంటలతో అధిక లాభాలు సాధించవచ్చని, రైతులు ఆ దిశగా అడుగులు వేయాలని నంది మేడారం ప్యాక్స్ చైర్మెన్ ముత్యాల బలరాం రెడ్డి కోరారు. రైతు వేదికలో వ్యవ సాయ ఉద్యాన, సహకార శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. మండల వ్యాప్తంగా ఇప్పటికే 250 ఎక రాల్లో సాగవుతుందని, వచ్చే ఏడాది మరో 100 ఎక రాల్లో సాగుకు కృషి చేస్తామన్నారు. అంతర పంట లుగా మొక్కజొన్న, వేరుశనగ, పత్తి సాగు చేయవ చ్చని తెలిపారు. మండల ఉద్యాన విస్తరణాధికారి మహేష్ మాట్లాడుతూ 90 శాతం సబ్సిడీతో రైతులకు మొక్కలు అందిస్తున్నామని, ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బీసీ, సన్న చిన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీతో పంటకు డ్రిప్ సిస్టంను అందిస్తామని పేర్కొ న్నారు. మండల వ్యవసాయ విస్తరణ అధికారి ఏ.అఖిల, మల్లేష్, సామంతుల రాయమల్లు, మానిట రింగ్ అధికారి సత్యనారాయణ, హరీష్ పాల్గొన్నారు.
పంట మార్పిడితోనే రైతులకు లాభాలు
పెద్దపల్లి రూరల్, (ఆంధ్రజ్యోతి): రైతులు ఒకే పంటను సాగు చేయడం ద్వారా భూమిలో సారం తగ్గుతుందని, పంటలు మార్పు చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. అప్పన్నపేట వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సహకార వారోత్స వాలు నిర్వహించారు. ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. సహకార సంఘాల ద్వారా రైతు లకు సబ్సిడి విత్తనాలు, రుణాలు, ఎరువులు, ధాన్యం కొనుగోలు కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. ఆయిల్‌పామ్ సాగు చేసుకుంటే మూడు సంవత్సరాల అనంతరం రైతులకు ఎంతో మేలు జరుగుతుంద న్నారు. జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్, సింగిల్ విం డో చైర్మన్ చింతపండు సంపత్, ఏవో అలివేణి, కాం గ్రెస్ నాయకులు నూగిల్ల మల్లయ్య, మాజీ మార్కేట్ కమిటి చైర్మన్ సురేందర్, కలబోయిన మహేందర్, మందల సత్యనారాయణరెడ్డి ,సందనవేన రాజేందర్, అరె సంతోష్, సీఈఓ తిరుపతి, పాల్గొన్నారు.