Share News

గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం

ABN , Publish Date - Jul 09 , 2025 | 12:11 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నరలోనే గ్రామాల అభివృద్ధికి కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. హన్మాండ్లపల్లి, కందునూరిపల్లి, కొత్తపేట, నారాయణపూర్‌, కొదురుపాక, దేవునిపల్లి తదితర గ్రామాలలో మంగళవారం సీసీ రోడ్లు, డ్రైనేజీలు, హెల్త్‌ సెంటర్‌, కమ్యూనిటీ హాల్‌, బోర్‌ వెల్‌ తదితర పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.

గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం

సుల్తానాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నరలోనే గ్రామాల అభివృద్ధికి కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. హన్మాండ్లపల్లి, కందునూరిపల్లి, కొత్తపేట, నారాయణపూర్‌, కొదురుపాక, దేవునిపల్లి తదితర గ్రామాలలో మంగళవారం సీసీ రోడ్లు, డ్రైనేజీలు, హెల్త్‌ సెంటర్‌, కమ్యూనిటీ హాల్‌, బోర్‌ వెల్‌ తదితర పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రోసీడింగ్స్‌ అందజేసి ముగ్గులు పోశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తక్కువ సమయంలో తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, ఇంకా మూడున్నరేళ్ళ సమయం ఉందని, అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత తనదన్నారు. పదేళ్ళలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ ఒక్క మేలు చేయలేదన్నారు.

ఎనభై శాతం మందికి ఉచిత విద్యుత్‌ అమలవుతుందని, మూడు పూటల సన్న బియ్యం తినే భాగ్యం సీఎం రేవంత్‌రెడ్డి వల్ల సాధ్యమైందన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మినుపాల ప్రకాష్‌ రావు, సింగిల్‌ విండో చైర్మన్‌ శ్రీగిరి శ్రీనివాస్‌, పన్నాల రాములు, దామోదర్‌ రావు, తిరుపతి, కల్లెపల్లి జానీ, చిలుక సతీష్‌, అబ్బయ్య గౌడ్‌, రమేష్‌, ఎంపీడీవో దివ్యదర్శన్‌ రావు, పీఆర్‌ఏఈ సచిన్‌, పీహెచ్‌సీ వైద్యులు ఉదయకుమార్‌, స్వప్న తదితరులు పాల్గొన్నారు,

Updated Date - Jul 09 , 2025 | 12:11 AM