Share News

జిల్లాలో జోరువాన

ABN , Publish Date - May 23 , 2025 | 12:24 AM

జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. గురువారం ఉద యం 8 గంటల వరకు అంతర్గాం మండలం ఆకెన పల్లిలో అత్యధికంగా 81.0 మిల్లీమీటర్ల వర్షం కురి సింది. రామగుండంలో 32.8 మిల్లీమీటర్లు, కమాన్‌ పూర్‌లో 14.8 మిల్లీమీటర్లు, ఈసాలతక్కళ్లపల్లిలో 11.3 మిల్లీమీటర్లు, ముల్కలపల్లిలో 10.5, మల్యాలపల్లిలో 10.0, పాలితంలో 8.3, కల్వచర్లలో 8.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

జిల్లాలో జోరువాన

పెద్దపల్లి, మే 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. గురువారం ఉద యం 8 గంటల వరకు అంతర్గాం మండలం ఆకెన పల్లిలో అత్యధికంగా 81.0 మిల్లీమీటర్ల వర్షం కురి సింది. రామగుండంలో 32.8 మిల్లీమీటర్లు, కమాన్‌ పూర్‌లో 14.8 మిల్లీమీటర్లు, ఈసాలతక్కళ్లపల్లిలో 11.3 మిల్లీమీటర్లు, ముల్కలపల్లిలో 10.5, మల్యాలపల్లిలో 10.0, పాలితంలో 8.3, కల్వచర్లలో 8.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం మధ్యాహ్నం ఆకా శం మేఘావృతమై జిల్లాలోని పెద్దపల్లి, గోదావరి ఖని, రామగుండం, సుల్తానాబాద్‌, మంథని, తదితర ప్రాం తాల్లో వర్షం కురుస్తున్నది. రాత్రి 7 గంటల ప్రాంతం లో జిల్లా అంతటా భారీ వర్షం కురిసింది. ఈ వర్షాల వల్ల అక్కడక్కడ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడి సింది. ఎండలకు ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు వర్షాలు ఉపశమనం కలిగిస్తున్నాయి.

కళ్యాణ్‌నగర్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండంతో రెండు రోజులుగా రామగుండం పారిశ్రా మిక ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుంది. గురువా రం 2.6సెంటమీటర్ల వర్షపాతం నమోదు కాగా బుధవారం 4సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రెండు రోజుల్లో 6సెంటీమీటర్ల వర్షం కురిసింది. బుధ వారం పలు కాలనీల్లో వరద నీరు ఇండ్లలోకి చేరాయి. గురువారం తెల్లవారు జాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో పలు వీధులు జల మయమయ్యాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ తెలిపింది.

నేలకొరిగిన వృక్షాలు

పాలకుర్తి: మండలం పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం కురిసిన భారీ వర్షాలకు అక్కడక్కడ చెట్లు నేలకూలాయి. కుక్కలగూడూర్‌ గ్రామంలో భారీ వృక్షాలు బియ్యాల సత్తయ్య, రాజేశం, విఠల్‌ ఇండ్లపై పడ డంతో ఇండ్లు స్వల్పంగా కూలిపోయాయి. ఇంటిలో ఉన్నవారు కూలుతున్న సమయంలో వచ్చిన భారీ శబ్దాలకు బయటకు పరుగులు తీశారు.

Updated Date - May 23 , 2025 | 12:24 AM