దంచికొట్టిన వాన
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:46 PM
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం 11గంటల వరకు భారీ వర్షం కురిసింది. రామ గుండంలో 8సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా పట్టణంలోని ప్రధాన నాలాలు పొంగి పొర్లాయి.
కళ్యాణ్‌నగర్, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం 11గంటల వరకు భారీ వర్షం కురిసింది. రామ గుండంలో 8సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా పట్టణంలోని ప్రధాన నాలాలు పొంగి పొర్లాయి. గోదావరిఖని ఫైవింక్లయిన్, 2ఇంక్లైన్ మోరీలు నీట మునగగా వాహనాల రాకపో కలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫైవింక్ల యిన్ వంతెన దాటడానికి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం సింగరేణి గనులకు వెళ్లే కార్మికులు అవస్థలు పడ్డారు. మల్లికార్జున్‌నగర్, ఫైవింక్లయిన్ ప్రధాన నాలా లు ఉప్పొంగాయి. మార్కండేయకాలనీ లోని బీసీ హాస్టల్‌లోని రోడ్లు జలమయం కాగా ఇండ్ల ముందున్న వాహనాలు నీటిలో మునిగాయి. కార్పొరేషన్‌లోని పలు ఏరియాల్లో రోడ్లన్నీ జలమయంగా మారాయి. భారీ వర్షంతో ఇండ్ల నుంచి ప్రజలెవరూ బయటకు రాలేదు.
విలోచవరం వంతెనపై వరద నీరు
మంథనిరూరల్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): మంథని మండలంలో శుక్రవారం రాత్రి కురి సిన వర్షానికి మంథని నుంచి విలోచవరం వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహి స్తోంది. శనివారం పోలీసులు గ్రామంలో పర్య టించి రహదారిని మూసివేశారు. విలోచవరం సమీపంలోని నాగారం, గుంజపడుగు, విలోచ వరంలోని కొత్త చెరువులలోకి నీరు చేరి అ లుగు పడటంతో ఆ వరద నీరు పరికి వాగు లోకి చేరడంతో వాగులోని నీరు వంతెనపైకి రావడంతో రహదారి మునిగిపోయింది. దీంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు గ్రామస్థులతో మాట్లాడి రహదారిని మూసివేస్తున్నట్లు హెచ్చ రిక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. వర్షాల కారణంగా వరదలు వచ్చే ప్రమాదం ఉన్నందున జా గ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. దీంతో ప్రజలు తమ రాకపోకలను సమీపం లోని పోతారం, నాగారం, ఉప్పట్ల, గుంజ పడుగు మీదుగా సాగిస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పై నుంచి వరద నీరు వస్తుండ టంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీరు కిందకు వదలుతున్నందున సిరిపురం వద్ద సుందిళ్ల బ్యారేజి గేట్లు ఎత్తి ఉండటం వలన నది పరి హక ప్రాంతంలోకి ఏ సమయంలోనైనా వరద నీరు వచ్చే అవకాశం ఉందని బ్యారేజి అధికారులు ప్రకటించారు. రైతులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. బ్యారేజికి దిగువన గోదావరి పరివాహక ప్రాంతం వెంట ఉన్న సిరిపురం, ఉప్పట్ల, విలోచవరం, పోతారం, గ్రామల రైతులు ముందస్తుగా గోదావరి నదిలో రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటార్లు, తీగలను తొలిగిస్తున్నారు.