Share News

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:19 AM

సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సంద ర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా కేం ద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొన్నారు. అమర్‌నగర్‌ చౌరస్తా వద్ద గల సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి ఉపాధ్యా యులు, నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

పెద్దపల్లి కల్చరల్‌, సెప్టెంబరు 5 (ఆం ధ్రజ్యోతి): సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సంద ర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా కేం ద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొన్నారు. అమర్‌నగర్‌ చౌరస్తా వద్ద గల సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి ఉపాధ్యా యులు, నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సిరి ఫంక్షన్‌ హాల్‌లో పెద్దపల్లి రెసిడెన్షియల్‌ టీచర్స్‌ అసోసి యేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమా వేశంలో ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్ర మాన్ని ప్రారంభించారు.

ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ గొప్పతనాన్ని వివరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యారం గానికి, ఉపాధ్యాయు లకు అందిస్తున్న సేవలను వివరించారు. ఎమ్మె ల్యేను ఉపాధ్యాయులు సన్మానించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 70 మంది ఉత్తమ ఉపా ధ్యాయులను సన్మానించారు. డీసీఈబీ కార్య దర్శి హనుమంతు, ఎంఈఓ సురేందర్‌ కుమా ర్‌, ప్రభుత్వ ఎగ్జామ్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రాంరెడ్డి, హెడ్‌మాస్టర్‌ చాట్ల ఆగయ్య, రెసి డెంట్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సాదు ల వెంకటేశ్వర్లు, జనరల్‌ సెక్రటరీ వేగోళం సత్య నారాయణ, కోశాధికారి కర్రె ప్రవీణ్‌, ఉపాధ్య క్షులు మహేందర్‌ రెడ్డి, రామస్వామి, కార్యవర్గ సభ్యులు కిషన్‌ రెడ్డి, సంపత్‌ రెడ్డి, కనకయ్య, ఫనీందర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కాల్వశ్రీరాంపూర్‌, (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యా య దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధా కృష్ణ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంబాల తిరుపతిని మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్‌ మం డల కేంద్రంలోని మార్కండేయ దేవాలయం ఎదుట సన్మానించారు. మాజీ సర్పంచ్‌లు ఆడేపు శ్రీదేవి రాజు, మాదాసు సతీష్‌, సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ సబ్బని రాజమల్లు, మాజీ ఎంపీటీసీ బంగారు రమేష్‌, ఎనగంటి రవి, ఆడేపు శ్రీనివాస్‌, కాసర్ల శ్రీనివాస్‌, గోలి సుధాకర్‌, శంకర్‌, రవి, రాజయ్య పాల్గొన్నారు.

సుల్తానాబాద్‌, (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్‌ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో గర్రెపల్లి మాడల్‌ స్కూల్‌, జూనియర్‌ కళాశాలలోని 30 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు జూపల్లి తిరుమ ల్‌ రావు వారికి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం రానున్న బతుకమ్మ పండు గకు వంద కోలలను కళా శాల ప్రిన్సిపాల్‌ చేతుల మీదుగా విద్యార్థినులకు అం దజేశారు. జిల్లా చీఫ్‌ కోఆర్డినేటర్‌ వలస నీలయ్య, పూసాల సాంబమూర్తి, త మ్మనవేని సతీష్‌, పూసాల రామకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్‌ గోల్డి బల్బీర్‌ కౌర్‌ పాల్గొన్నారు.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురుస్‌, స్టూడెంట్స్‌ అండ్‌ పేరెంట్స్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఇండియా ఆధ్వర్యంలో సుల్తానాబాద్‌ శ్రీవాణి పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌ బండారి కమలాకర్‌కు జిల్లా స్థాయి ఉత్తమ లెక్చరర్‌ అవార్డును ప్రధానం చేశారు.

మంథని, (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ దినోత్సవాన్ని మంథనిలో ఘనంగా జరుపుకున్నారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విగ్రహానికి బీఆర్‌ఎస్‌ నేతలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్‌ నేతలు రాధాకిష్ణన్‌ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. వివిధ పాఠశాలు, కళాశాలల్లో ఉపాధ్యాయులను విద్యార్థులు సన్మానించారు.

Updated Date - Sep 06 , 2025 | 12:19 AM