సమస్యలతో సతమతమవుతున్న గురుకుల పాఠశాలలు
ABN , Publish Date - Jul 28 , 2025 | 11:45 PM
గురు కుల పాఠశాలలు సౌకర్యాల లేమితో కొట్టుమి ట్టాడుతున్నాయని, ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య ఆరోపించారు. సోమవారం గోదావరిఖని శ్రామిక భవన్‌లో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యం లో నిర్వహించిన శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
గోదావరిఖని, జూలై 28(ఆంధ్రజ్యోతి): గురు కుల పాఠశాలలు సౌకర్యాల లేమితో కొట్టుమి ట్టాడుతున్నాయని, ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య ఆరోపించారు. సోమవారం గోదావరిఖని శ్రామిక భవన్‌లో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యం లో నిర్వహించిన శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గురుకులాల దిశను మారుస్తామని చెప్పి నప్పటికీ అమలు కావడం లేదని, విద్యార్థులు ఫుడ్‌పాయిజన్ జరిగి మృతి చెందడం, అనారోగ్యా నికి గురవుతున్నారన్నారు.
హుజురాబాద్‌లోని గురుకుల పాఠశాలలో విద్యార్థు లను ఎలుకలు కరవడంతో ఆసు పత్రి పాలయ్యారని, నాగర్ కర్నూల్‌లో ఫుడ్‌పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారన్నారు. ఓబీసీలకు 42శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు చేయా లని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినప్ప టికీ బిల్లు ఆమోదం చేయకుం డా మోదీ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు జరిగే పరిస్థితి లేదని, స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబరులోపు నిర్వహించాలని హైకోర్టు ఆదే శించినా ప్రక్రియ మొదలు కాలేదన్నారు. కేంద్ర మంత్రులైన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు 8మంది ఎంపీలను, బీజేపీ ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. బీసీ లకు బీజేపీ ద్రోహం చేస్తుందని ఆరోపించారు. బిక్షపతి ప్రిన్సిపాల్‌గా వ్యవహరించగా సీపీఎం నాయకులు యాకయ్య, మహేశ్వరి, ముత్యం రావు, రాజారెడ్డి, మెండె శ్రీనివాస్, గణేష్, కుమా రస్వామి, రామాచారి, గణేష్ పాల్గొన్నారు.