Share News

గ్రూపులతో విద్యార్థుల్లో పోటీత్వం పెరుగుతుంది

ABN , Publish Date - Dec 01 , 2025 | 11:53 PM

పాఠశాలల్లో విద్యా ర్థులను నాలుగు హౌజ్‌ల కింద విభజిస్తే వారికి మేలు జరుగుతుందని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్టర్‌ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, గ్రంథాలయం సందర్శించారు.

గ్రూపులతో  విద్యార్థుల్లో పోటీత్వం పెరుగుతుంది

పెద్దపల్లి కల్చరల్‌, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో విద్యా ర్థులను నాలుగు హౌజ్‌ల కింద విభజిస్తే వారికి మేలు జరుగుతుందని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్టర్‌ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, గ్రంథాలయం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో పిల్లలను నాలుగు హౌసెస్‌గా విభజించామని, రెడ్‌హౌస్‌కు అబ్దుల్‌ కలాం, గ్రీన్‌హౌస్‌కు శకుంతల దేవి, బ్లూహౌస్‌కు సీవీ రామన్‌, యేల్లో హౌస్‌కు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పేరు పెట్టినట్లు తెలిపారు. ఈ హౌస్‌ల మధ్య వ్యాసరచన పోటీలు, క్విజ్‌ పోటీలు నిర్వహిస్తామన్నారు.

జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన హెచ్‌ఎంను, ఉపాధ్యాయులను కలెక్టర్‌ అభినందించారు. సమయపాలన పాటిం చాలని, మొక్కల పెంపకం, సమాజ బాధ్యత సేవా కార్యక్రమాల వైపు విద్యార్థులు దృష్టి సారించాలని తెలిపారు. గ్రంథాలయంలో పాఠకులకు అవసరమైన వసతుల వివరాలు తెలుసుకున్నారు. ఆర్డీఓ గంగయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేష్‌, ఎంఈఓ సురేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2025 | 11:53 PM