Share News

ఆస్పత్రి భవన నిర్మాణానికి భూమి పూజ

ABN , Publish Date - May 08 , 2025 | 11:41 PM

జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసు పత్రిలో అన్ని రకాల మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పాత భవనం కూల్చి కొత్త భవన నిర్మాణ పనులకు గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ఆస్పత్రి భవన నిర్మాణానికి భూమి పూజ

పెద్దపల్లిటౌన్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసు పత్రిలో అన్ని రకాల మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పాత భవనం కూల్చి కొత్త భవన నిర్మాణ పనులకు గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల సీఎం రేవంత్‌ రెడ్డి పెద్దపల్లి పర్యటనకు వచ్చిన సందర్భంగా రూ. 51 కోట్లతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు విస్తరించేందుకు పరిపాలనా అనుమతులు ఇచ్చారన్నారు. పెరుగుతున్న రోగు లకు అన్ని రకాల వైద్య సేవలు ప్రభుత్వ ఆసుప త్రిలో అందేలా పాత భవనం కూల్చి అధునాతన భవన నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేసేలా చర్య లు తీసుకుంటామన్నారు. పనుల నిర్మాణ అనుమ తులు ఉన్న కాంట్రాక్టర్‌ ఏడాదిన్నర సమయం ఉన్నా ఏడాదిలోగా పూర్తి చేయాలని, అందుకు సహకరి స్తామన్నారు. ఆస్పత్రిలో పరీక్షలు, వివిధ రకాల ఆపరేషన్లు, డెలివరీలు తదితర వైద్య సేవలు అందిస్తాన్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మార్కెట్‌ చైర్‌ప ర్సన్‌ ఈర్ల స్వరూప, ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ శ్రీధర్‌, వైద్యులు, కాంగ్రెస్‌ నాయకులు, అధికారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 11:41 PM