తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ
ABN , Publish Date - Jun 16 , 2025 | 12:12 AM
మండలం పరిధి లోని విమానాశ్రయ ప్రాంతంలో తహసీల్దార్ కార్యాలయం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ ఆదివారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయానికి భవనం లేకపోవడంతో అధికారులు, సిబ్బంది, కార్యాలయానికి వస్తున్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పాలకుర్తి, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): మండలం పరిధి లోని విమానాశ్రయ ప్రాంతంలో తహసీల్దార్ కార్యాలయం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ ఆదివారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయానికి భవనం లేకపోవడంతో అధికారులు, సిబ్బంది, కార్యాలయానికి వస్తున్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు కోటి రూపాయల వ్యయంతో 7 విభాగాల గదులు, ఆధునిక సదుపా యాలతో నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
తహసీల్దార్ జేరుపోతుల సునీత, పంచాయతీ రాజ్ డీఈ అప్పల నాయుడు, ఏఈ రషికేష్, మక్కాన్ సింగ్ సేవ సమితి చైర్‌పర్సన్ మనాలి ఠాకూర్, రామగుం డం మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం తిరుపతి, మాజీ ఎంపీపీ గంగాధరి రమేష్ గౌడ్, కన్నాల పీఎసీఎస్ చైర్మన్ బయ్యపు మనోహర్ రెడ్డి, డీసీసీ ప్రధానకార్యదర్శి సూర సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.