Share News

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

ABN , Publish Date - Nov 14 , 2025 | 12:08 AM

కొను గోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. గురువారం మీర్జంపేట, వెన్నంపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చారు.

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

కాల్వశ్రీరాంపూర్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): కొను గోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. గురువారం మీర్జంపేట, వెన్నంపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చారు. ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌ రెడ్డి సన్న వడ్లకు బోనస్‌ ఇస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు కోతలు, కటింగ్‌ల పేరుతో దోపిడి చేశారని, తమ ప్రభుత్వ హయంలో ఎలాంటి మోసా లకు తావులేకుండా, అమ్ముకున్న 48 గంటల్లోనే డబ్బులు అకౌంట్లలో జమ అవుతున్నాయని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ రైతుల కోసం మొసలి కన్నీరు కార్చుతూ రోడ్డు మీదకు వస్తున్నారని, ఈ విషయంలో రైతులు ఆలోచన చేయాలన్నారు. మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ చదువు రామచంద్రారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ రామిడి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్య క్షుడు సదయ్య, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, సొసైటీ సీఈఓలు కోలేటి శ్రీనివాస్‌, విజయేందర్‌ పాల్గొన్నారు.

జూలపల్లి, (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకుని మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. వడుకాపూర్‌ , కాచాపూర్‌, కుమ్మరికుంట, జూల పల్లి, కోనరావుపేట గ్రామాల్లో గురువారం కొనుగోలు కేంద్రాలను ప్రారంబించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ రైతుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తుందన్నారు. విండో చైర్మెన్‌ వేనుగోపాల్‌రావు, వైస్‌చైర్మెన్‌ కంది మల్లారెడ్డి, మార్కెట్‌ కమిటి వైస్‌చైర్మెన్‌ పోచాలు, నాయకులు బొజ్జ శ్రీనివాస్‌, లోక జలపతిరెడ్డి, తొంటి మదుకర్‌, మాజీ సర్పంచ్‌ సంతోష్‌రావు, మెతుకు కాంతయ్య, కన్నం రాంనారాయణ, సతీష్‌, చిన్నలింగయ్య, అంజయ్య, బండి స్వామి, కొమురయ్య, మల్లయ్య, యాదయ్య, కనకట్ల శ్రీనివాస్‌, పాల్గొన్నారు.

పాలకుర్తి, (ఆంధ్రజ్యోతి): ఈసాలతక్కళ్ళపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ ప్రారంభిం చారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటేనే రైతుల మేలు కోరే ప్రభుత్వమని, రైతులు నష్టపోవద్దని ప్రతీ పంటను మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఎల్కలపల్లి, గుంటూర్‌ పల్లి, రామరావుపల్లె గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను మక్కా న్‌సింగ్‌ సేవసమితి చైర్మన్‌ మనాలిఠాకూర్‌ ప్రారం భించారు. మాజీ ఎంపీపీ గంగాధరి రమేష్‌ గౌడ్‌,కన్నాల ఫ్యాక్ష్‌ చైర్మెన్‌ బయ్యపు మనోహర్‌ రెడ్డి,మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

జిల్లా మహాసభల కరపత్రాల పంపిణీ

జ్యోతినగర్‌, నవంబరు13(ఆంధ్రజ్యోతి): సీఐటీయూ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని నాయకులు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ నెల 16న జిల్లా కేం ద్రంలో జరిగే మహాసభల విజయవంతం చేయాలని యూనియన్‌ ప్రధాన కార్యదర్శి గీట్ల లక్ష్మారెడ్డి కోరారు.

Updated Date - Nov 14 , 2025 | 12:08 AM