Share News

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:26 PM

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకాలను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ వేణు సంబంధిత అదికారులను, సెంటర్‌ ఇంచార్జిలను ఆదేశించారు. జూలపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి తూకాలను పరిశీలించారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

జూలపల్లి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకాలను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ వేణు సంబంధిత అదికారులను, సెంటర్‌ ఇంచార్జిలను ఆదేశించారు. జూలపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి తూకాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వాతావర ణంలో మార్పులు సంభవిస్తున్నా దృష్ట్యా రైతులు ధాన్యం ఆరబోసుకుని తేమ శాతం వచ్చేలా సహకరించాలన్నారు.

దళారులకు ధాన్యం అమ్మి రైతులు మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకుని మద్దతు ధర పొందాలన్నారు. తహసీల్దార్‌ జక్కని స్వర్ణ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కొమ్మపోచాలు, గిర్దావరి భవాని ప్రసాద్‌, పలువురు రైతులు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 11:26 PM