ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:54 PM
ముల్కల పల్లి, కమాన్‌పూర్, రాజాపూర్, గుండారం, పేరపల్లి, సిద్దిపల్లె, నాగారం గ్రామాల్లో సోమవారం సెర్ప్ ఆధ్వ ర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు ప్రారంభించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు.
కమాన్‌పూర్, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ముల్కల పల్లి, కమాన్‌పూర్, రాజాపూర్, గుండారం, పేరపల్లి, సిద్దిపల్లె, నాగారం గ్రామాల్లో సోమవారం సెర్ప్ ఆధ్వ ర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు ప్రారంభించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. మాజీ ఎంపీపీలు మల్యాల రామ చంద్రం గౌడ్, కోలేటి మారుతి, ఎస్‌ఐ కొట్టె ప్రసాద్ లతోపాటు సెర్ప్ ఉద్యోగులు, మహిళలు, రైతులు, హమాలీలు పాల్గొన్నారు.
ముత్తారం, (ఆంధ్రజ్యోతి): ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కమాన్‌పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు అన్నారు. మండల కేంద్రంతోపాటు మచ్చుపేట, మైదంబండ, హరిపురం, కేశనపల్లి, అడవి శ్రీరాంపూర్, ఖమ్మంపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ అల్లాడి యాద గిరిరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, ఏఎంసీ వైస్‌చైర్మన్ మద్దెల రాజయ్యతో కలిసి ప్రారం భించారు. కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాదం శ్రీని వాస్, మార్కెట్ డైరెక్టర్ బోల్నేని బచ్చంరావు, మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు వాజిద్ పాషా, జాగిరి సమ్మయ్య, ఆరెల్లి శ్రీనివాస్, సిద్దం మురళీ కృష్ణ, ఏఈఓ హారిక, ఐకేపీ సభ్యుడు తిరుపతి పాల్గొన్నారు.
సుల్తానాబాద్, (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకొని మద్దతు ధర పొందాలని కేడీసీసీబీ డైరెక్టర్ మోహన్‌రావు రైతులకు సూచించారు. చిన్నక ల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వ ర్యంలో సోమవారం దేవునిపల్లి, కొదురుపాక, నారాయణ పూర్ తదితర గ్రామాల్లో కొనుగోలు సెంటర్లను మార్కె ట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావుతో కలిసి ప్రారం భించారు. వారు మాట్లాడుతూ రైతులకు అందుబా టులోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, నిబంధనల మేరకు ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని కోరారు. మాజీ ఎంపీటీసీ పన్నాల రాములు, సొసైటీ సీఈఓ వల్లకొండ రమేష్, పాలకవర్గ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
మంథనిరూరల్, (ఆంధ్రజ్యోతి): కన్నాల, ఖానాపూర్, గోపాల్‌పూర్, గుంజపడుగు, నాగరం, గద్థలపల్లి, బిట్టు పల్లి, చిన్న ఓదాల, విలోచవరం, గ్రామలలో ప్రాథమిక వ్యవసాయ సహకర సంఘం అధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏంఎసి చైర్మన్‌కుడుదుల వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్‌లు ప్రారంభించారు. నాయ కులు రావికంటి సతీష్ కుమార్, రాజబాపు, ప్రశాంత్ రెడ్డి, కిరణ్, రాజమల్లు, విజయ్‌కుమార్ పాల్గోన్నారు.
ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని పీఏసీఎస్ చైర్మన్ పుల్లూరి వేణుగోపాల్ రావు అన్నారు. సోమవారం ధూళి కట్ట, ముప్పిరితోట గ్రామాల్లో ఏర్పాటు చేసిన పీఏసీఎస్, ఐకేపీ ధాన్యం కేంద్రాలను ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమకు రైతులు నేరుగా సంప్రదించాలని అన్నారు. ఉపాధ్యక్షుడు కంది మల్లారెడ్డి, ఐకేపీ ఏపీఎం గీతా, సీసీ పద్మ, డైరెక్టర్‌లు బత్తిని లచ్చయ్య, సమ్మయ్య, రాజయ్య, పోల్సాని పుల్లారావు, పాల్గొన్నారు.