మహిళా సాధికారికతకు సర్కారు సన్నాహాలు
ABN , Publish Date - Sep 01 , 2025 | 12:29 AM
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారికతపై దృష్టి సారించింది. మహిళలను కోటీశ్వర్లను చేస్తామని అధికారంలోకి వచ్చిన పార్టీ అందుకు అడుగులు వేస్తోంది. గ్రామీ ణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ నేతృత్వంలో క్షేత్ర స్థాయి నుంచి మహిళలను సాధికారత వైపు నడిపిం చేందుకు కృషి చేస్తోంది.
గోదావరిఖని, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారికతపై దృష్టి సారించింది. మహిళలను కోటీశ్వర్లను చేస్తామని అధికారంలోకి వచ్చిన పార్టీ అందుకు అడుగులు వేస్తోంది. గ్రామీ ణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ నేతృత్వంలో క్షేత్ర స్థాయి నుంచి మహిళలను సాధికారత వైపు నడిపిం చేందుకు కృషి చేస్తోంది. మహిళా సంఘాల ఆధ్వ ర్యంలో మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు నడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. 60ఏళ్లు దాటిన మహిళలను కూడా గ్రూపులుగా ఏర్పాటుకు సిద్ధపడుతోంది. ప్రభుత్వమే మహిళలకు అనేక రకాల బీమాను తీసుకువచ్చేందుకు కసరత్తులు మొదలు పెట్టింది. ప్రతీ స్వయం సహాయక సంఘాల మహిళ లకు రూ.10లక్షల ప్రమాద బీమాను వర్తింప చేస్తు న్నది. ఇందిరా మహిళా శక్తి ద్వారా అనేక ఆర్థిక పథకాలను ప్రవేశపెడుతోంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళా గ్రూపులన్నీంటికి ఒకే పరిపాలన విభాగం నుంచి పనులు జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుం టున్నది. ఇంత కాలం పట్టణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్(మెప్మా) ఆధ్వర్యంలో, గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్‌డీఏ నుంచి కార్యకలాపాలు నడిచేవి. మూడు మాసాలుగా మెప్మాను డీఆర్‌డీఏ కిందకు తీసుకువచ్చి గ్రామీణ, పట్టణ ప్రాంతాల మహిళ సమాఖ్యలకు ఒకే విధమైన ప్రయోజనాలు అందేలా కార్యాచరణ తీసుకున్నది.
జిల్లాల వారీగా మహిళా సంఘాల్లో ఉండే నిరక్ష రాస్యులను వంద శాతం అక్షరాస్యత వైపు తీసుకెళ్లాల నేది ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్నది. జిల్లాలో 1.1లక్షల మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో సంఘాలుగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 10,750 సంఘాలు ఉన్నా యి. ఇందులో 49500మంది నిరక్షరాస్యులుగా ఉన్నట్టు ప్రభుత్వం తేల్చింది. మొదటి విడుతగా 28326 మం దిని అక్షరాస్యులుగా చేయాలనేది డీఆర్‌డీఏ లక్ష్యంగా పెట్టుకున్నది. వీరిని సంవత్సర కాలంలో అక్షరాస్యులను చేయాలనేది కాలపరిమితిగా ప్రయత్నాలు చేస్తోంది. నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉల్లాస్ యాప్‌లో నమోదు చేసే విషయంలో, గుర్తించే విషయంలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో ప్రథమస్థానంలో ఉన్నది. మహిళా సంఘం రుణం పొందితే అందులో ఒక మహిళ చనిపోతే ఆ మహిళపై ఉన్న అప్పు మహిళా సంఘం చెల్లించాల్సి ఉంటుంది. కానీ బీమా వల్ల ఆమెపై ఉన్న అప్పును బీమా సంస్థనే చెల్లించేలా ప్రభుత్వం సహకరిస్తున్నది. స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలందరికి ప్రమాద బీమా కింద రూ.10లక్షలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నది. సంఘాల్లో ఉండే మహిళలు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10లక్షలు వచ్చేలా ఈ పథకం రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 65లక్షల మంది స్వయం సహాయక సం ఘాల్లో సభ్యులుగా ఉన్నారు. 18 నుంచి 60ఏళ్ల వయసు ఉన్న వారు మాత్రమే ఈ సంఘాలకు అర్హులు. 60ఏళ్లు దాటిన మహిళలు కూడా గ్రూపు లుగా తయారు చేయాలని, వృద్ధ మహిళలకు కూడా హక్కులు ఉంటాయని ప్రభుత్వం నిర్ణయం తీసుకు న్నది. అంతేకాకుండా 14 నుంచి 18ఏళ్ల బాలికలను స్వయం సహాయ సంఘాలుగా ఏర్పాటు చేయాలని చూస్తున్నది. ఎవరికి వారుగా ఉన్న వికలాంగులను కూడా గ్రూపులుగా చేసి అందులో స్త్రీ, పురుష సంఘాలను ఏర్పాటు చేసి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చుతూ ఆర్థిక స్వయం శక్తివైపు నడిపించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నది.