చేనేత రంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Aug 08 , 2025 | 12:26 AM
చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అదనపు కలెక్టర్ దాసరి వేణు తెలిపారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో వేడుకలు నిర్వహించారు.
పెద్దపల్లి కల్చరల్, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అదనపు కలెక్టర్ దాసరి వేణు తెలిపారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో వేడుకలు నిర్వహించారు. చేనేత కార్మికులతో కలెక్టరేట్ మెయిన్ గేట్ నుంచి సమావేశ మందిరం వరకు ర్యాలీ నిర్వహించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కొండా లక్ష్మన్ బాపూజీ చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుగ్రహీతలైన చేనేత కార్మికులు, సీనియర్ నేతన్నలను అదనపు కలెక్టర్ సన్మానించి, మెమోంటో అందజేశారు.
ఆయన మాట్లాడుతూ చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తుందన్నారు. ప్రభుత్వ రంగాల్లో వాడే యూనిఫామ్, స్కూలు పిల్లల దుస్తులు, మహిళ సంఘా లకు అందించే చీరలను చేనేత కార్మికుల వద్ద ఆర్డర్ చేసి నట్లు తెలిపారు. ప్రభుత్వ సదుపాయాలను సద్వినియో గం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు. చేనేత రంగంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలిచిన పాఠశాల విద్యా ర్థులకు బహుమతులు అందించారు. జడ్పీ సీఈఓ నరేందర్, పీడీ హౌసింగ్ రాజేశ్వర్, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్, పాల్గొన్నారు.