పాఠశాలల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Sep 17 , 2025 | 12:01 AM
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం 18 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎమ్మెల్యే పూలమాలలతో సన్మానించి, వారికి సన్మాన పత్రాలు, షీల్డు అందజేశారు.
కాల్వశ్రీరాంపూర్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం 18 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎమ్మెల్యే పూలమాలలతో సన్మానించి, వారికి సన్మాన పత్రాలు, షీల్డు అందజేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.1200 కోట్లు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సీఎం ప్రత్యేక కృషి చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు ప్రమోషన్లు లేవని, 21 వేల మంది ఉపాధ్యాయులకు తమ ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించిందన్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఇప్పటి వరకు రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం వచ్చేలా ఉపాధ్యాయులు తమవంతు కృషి చేయాలని కోరారు. గోపగాని సారయ్య గౌడ్ మాట్లాడుతూ 2015లో ఎంపీపీగా ఉన్నప్పుడు 1098 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి రూ.3 లక్షల విరాళంతో ఆంగ్ల పుస్తకాలు అందించినట్లు తెలిపారు. తహసీల్దార్ జగదీశ్వర్‌రావు, ఎంఈఓ సిరిమల్లె మహేష్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, వైస్‌చైర్మన్ సబ్బని రాజమౌళి, డైరెక్టర్ ఎనగంటి రవి, హరికృష్ణ గౌడ్, గాజనవేన సదయ్య, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.