Share News

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

ABN , Publish Date - Jul 27 , 2025 | 11:35 PM

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. గుంపుల, గూడెం, ఇందుర్తిలో రూ.1.71 కోట్ల వ్యయంతో నిర్మించే అభివృద్ధి పనులకు ఆదివా రం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదా రులకు పట్టాలను అందజేసి ముగ్గు పోసి నిర్మాణ పనులను ప్రారంభిం చారు.

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

ఓదెల, జూలై 27 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. గుంపుల, గూడెం, ఇందుర్తిలో రూ.1.71 కోట్ల వ్యయంతో నిర్మించే అభివృద్ధి పనులకు ఆదివా రం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదా రులకు పట్టాలను అందజేసి ముగ్గు పోసి నిర్మాణ పనులను ప్రారంభిం చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో రాజకీయాలకతీతంగా పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. మూడు సంవత్సరాల్లో విడుతల వారీగా అర్హత ఉన్న వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, ఎక్కడ లేని విధంగా రేషన్‌ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు. జిల్లాలో రైతులకు 31 కోట్ల బోనస్‌ చెల్లించామని, విడుదల వారిగా మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్‌ సాగర్‌ రెడ్డి, సిరిసెటి రాహుల్‌, గోపు నారాయణరెడ్డి రెడ్డి, రజనీకాంత్‌, చొప్పరి రాజయ్య, బొంగోని శ్రీనివాస్‌, వంగ శ్రీనివాస్‌, ఆకుల మహేందర్‌ పాల్గొన్నారు.

మజీద్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ ప్రారంభం

పెద్దపల్లి టౌన్‌, (ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌ సమీపంలో ఏర్పాటు చేసిన ఫిర్దోస్‌ మజీద్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ను ఆదివారం ఎమ్మెల్యే చిం తకుంట విజయరమణారావు ప్రారంభించారు. మజీద్‌ కమిటీ సభ్యు లు ఎంఏ మోహిద్‌, అబ్దుల్‌ హై జావిద్‌, హాది ఎమ్మెల్యేను సన్మా నించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ముస్లిం మైనా ర్టీల అభ్యున్నతికి కృషి చేస్తానని, పేద ముస్లింలకు త్వరలోనే ఇందిర మ్మ ఇండ్లు మంజూరయ్యేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు. ముస్లిం వాడల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. షాదీ ఖానా, మైనార్టీ డిగ్రీ కళాశాల, మైనార్టీ గ్రంథాలయం మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మజీద్‌ కమిటీ సభ్యులు, సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఈర్ల స్వరూప, పార్టీ నాయకులు సయ్యద్‌ మస్రత్‌, మైనార్టీ సంక్షేమ అధి కారి రంగారెడ్డి, టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్‌, చాం బర్‌ ఆఫ్‌ కామర్స్‌ జిల్లా అధ్యక్షుడు కమల్‌ కిషోర్‌, పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2025 | 11:35 PM