Share News

క్రీడలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

ABN , Publish Date - Sep 09 , 2025 | 12:17 AM

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా అభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని మున్సిపల్‌ కమి షనర్‌ రమేష్‌ అన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సోమవారం జోనల్‌ స్థాయి అండర్‌ 14, 17 బాలుర, బాలికల క్రీడా పోటీలను ఎంఈఓ ఆరెపల్లి రాజయ్య ప్రారంభించారు.

క్రీడలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

సుల్తానాబాద్‌, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా అభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని మున్సిపల్‌ కమి షనర్‌ రమేష్‌ అన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సోమవారం జోనల్‌ స్థాయి అండర్‌ 14, 17 బాలుర, బాలికల క్రీడా పోటీలను ఎంఈఓ ఆరెపల్లి రాజయ్య ప్రారంభించారు. సుల్తానాబాద్‌, ఓదెల, శ్రీరాంపూర్‌, ఎలి గేడు మండలాల నుంచి 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కమిషనర్‌ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు ప్రాథమిక స్థాయిలోనే క్రీడల్లో శిక్షణ ఇవ్వాలన్నారు. జిల్లా క్రీడల యోజనశాఖ అధికారి సురేష్‌ మాట్లాడుతూ జిల్లాలో క్రీడల నిర్వహణకు తగిన ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. మంగళవా రం బాలురకు వాలీబాల్‌, కబడ్డీ, బుధవారం బాలికలకు అథ్లెటిక్స్‌ పోటీలు ఉంటాయని ఎస్‌జీఎఫ్‌ క్రీడల ఇన్‌ చార్జి దాసరి రమేష్‌ తెలిపారు. ఎంపీడీఓ దివ్యదర్శన్‌ రావు, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి లక్ష్మన్‌, డీవైఎస్‌ఓ సురేష్‌, కాంప్లెక్స్‌ హెడ్‌మాస్టర్‌ రత్నాకర్‌ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు, స్పోర్ట్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు రవీందర్‌, కార్యదర్శి అమిరిశెట్టి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

మంథని, (ఆంధ్రజ్యోతి): పాఠశాలల క్రీడల అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెంకన్న, సింగిల్‌ విండో చైర్మన్‌కొత్త శ్రీనివాస్‌లు తెలిపారు. ప్రభుత్వ హైస్కూల్‌ మైదానంలో సోమవారం డివిజన్‌ స్థాయి ఎస్‌జిఎఫ్‌ క్రీడలను ప్రారం భించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణిం చాలని కోరారు. మాజీ సర్పంచ్‌ శ్రీనివాస్‌, సింగిల్‌ విండో డైరెక్టర్‌ సతీష్‌, ఎంఈఓ లక్ష్మి, ఎస్‌జిఎఫ్‌ జిల్లా సెక్రెటరీ శ్రీనివాస్‌ పాల్గ్గొన్నారు.

Updated Date - Sep 09 , 2025 | 12:17 AM