Share News

మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

ABN , Publish Date - Apr 27 , 2025 | 12:37 AM

మహి ళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఐబీ ఆవరణ లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సి పాలిటీ కొనుగోలు చేసిన రెండు ట్రాక్టర్లు, రెండు ట్రాలీలను, శ్రీనిధి ద్వారా కొనుగోలు చేసిన ఆటోను ఎమ్మెల్యే ప్రారంభించారు.

మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

సుల్తానాబాద్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): మహి ళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఐబీ ఆవరణ లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సి పాలిటీ కొనుగోలు చేసిన రెండు ట్రాక్టర్లు, రెండు ట్రాలీలను, శ్రీనిధి ద్వారా కొనుగోలు చేసిన ఆటోను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతు మహిళలను కోటీశఽ్వరులను చేయడమే కాంగ్రెస్‌ ఫ్రభు త్వ లక్ష్యమని, సుల్తానాబాద్‌ మండల సమాఖ్యకు ఆర్టీసీ బస్సును మంజూరు చేశారని, బస్సును అద్దె ఇవ్వడంతో మహిళా సంఘానికి నెల నెల ఆదాయం సమకూరుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లల కు స్కూల్‌ డ్రెస్సును మహిళా సంఘాల వారే కుట్టి వ్వడం వలన ఆదాయం పెరుగుతుందని, మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ అంతటి అన్నయ్య గౌడ్‌, మార్కెట్‌ చైర్మన్‌ మినుపాల ప్రకాశ్‌ రావు, సింగిల్‌ విండో చైర్మన్‌ శ్రీగిరి శ్రీనివాస్‌, పన్నాల రాములు, సాయిరి మహేందర్‌, గాజుల రాజమల్లు, దామోదర్‌రావు, బిరుదు కృష్ణ, అబ్బయ్య గౌడ్‌, చిలుక సతీష్‌,రాజలింగం, తిరుపతి, మున్సిపల్‌ కమిషనర్‌ మహ్మద్‌ నియాజ్‌, మెప్మా అధికారులు దుర్గా ప్రసాద్‌, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

జూలపల్లి, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో అర్హులైన పేద ప్రజ లకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే విజయరమణా రావు అన్నారు. శనివారం ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయనిధి, కల్యా ణలక్ష్మి, షాదీముభారక్‌ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. జూలపల్లి, కోనరావుపేట గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మె ల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కొను గోలు కేంద్రాల్లో తూకం పేరుతో రైతులను మోసం చేస్తే సహించేది లేదన్నారు. తహసీల్దార్‌ జక్కని స్వర్ణ, ఏఓ ప్రత్యూష, విండో చైర్మెన్‌ వేణుగోపాల్‌రావు, నాయకులు శ్రీనివాస్‌, లోక జలపతిరెడ్డి, దారబోయిన నర్సింహాయాదవ్‌, గంగిపెల్లి సుక్కయ్య, బండి స్వామి, కందుకూరి అంజయ్య, కొమురయ్య, పాల్గొన్నారు.

పెద్దపల్లిటౌన్‌, (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి మండలం, పట్టణానికి చెందిన 200 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే విజయరమణారావు లబ్ధిదారులకు అందజేశారు. 259 మంది సీఎంఆర్‌ఎఫ్‌ లబ్ధిదారులకు చెక్కులను ఆర్‌ఆర్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్లో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మార్కెట్‌ చైర్మన్‌ ఈర్ల స్వరూప, తహసీల్దార్‌ రాజయ్య, డిటీ విజేందర్‌, ఆర్‌ఐలు భాను కుమార్‌, రాజిరెడ్డి, జూనియర్‌ అసిస్టెంట్‌ సాకేత్‌, మల్లయ్య, పాల్గొన్నారు

Updated Date - Apr 27 , 2025 | 12:37 AM