Share News

యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలం

ABN , Publish Date - Sep 09 , 2025 | 12:20 AM

రైతుల అవసరాలకు యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే దాసరి మనో హర్‌రెడ్డి అన్నారు. రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులు, ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సోమవారం సుల్తానాబాద్‌లో ధర్నా చేపట్టారు.

యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలం

సుల్తానాబాద్‌, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): రైతుల అవసరాలకు యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే దాసరి మనో హర్‌రెడ్డి అన్నారు. రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులు, ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సోమవారం సుల్తానాబాద్‌లో ధర్నా చేపట్టారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి రైతులు అంబేద్కర్‌ విగ్రహం నుంచి ర్యాలీ నిర్వహించి రాజీవ్‌ రహదారి పక్క న ధర్నా చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్‌ ఎస్‌ పదేళ్ల పాలనలో ఎక్కడ యూరియా కొరత రాలేదని, రైతులు రోడ్డెక్కలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే మళ్లీ రైతులకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయన్నారు. ఎరువుల అంచనా లేకుండానే ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల పంటలు దెబ్బతిని, రైతులు నష్టపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఎన్నికల సంద ర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీ ల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. నాయకులు గొట్టం మహే ష్‌, గట్టు శ్రీనివాస్‌ గౌడ్‌, గుణపతి, శ్యాం, దయాకర్‌, కర్రె కుమారస్వామి, అంజయ్య గౌడ్‌, వంగళ తిరుపతిరెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ జూపల్లి సందీప్‌రావు, మాజీ జడ్పీటీసీ గంట రాములు, తానిపర్తి మోహన్‌ రావు, లక్ష్మన్‌, తాళ్లపల్లి మనోజ్‌ గౌడ్‌, బాబురావు, అరుణ్‌, సంపత్‌, రమణ, తిరుపతిరెడ్డి, చంద్రమౌళి, కాంపెల్లి రాజు, శంకర్‌ పాల్గొన్నారు.

ముత్తారం: మండలంలో యూరియా కోసం రైతులు క్యూకట్టారు. శనివారం సింగిల్‌విండో కార్యాలయానికి 340 బస్తాల యూరియా వచ్చింది. సమాచారం తెలుసుకొన్న రైతులు సోమవారం ఉదయమే కార్యాలయానికి చేరు కొని బారులుదీరారు. ఎండలో నిలబడలేక చెప్పులు క్యూ లైన్‌లో పెట్టి యూరియా కోసం బారులు తీరారు. అధికా రుల నిర్లక్ష్యం, సింగిల్‌విండో చైర్మన్‌ పట్టించుకోక పోవడంతోనే సకాలంలో మండలానికి యూరియా రావడం లేదని ఆరోపించారు. అధికారులు రైతుకు రెండు బస్తాల చొప్పున యూరియా సరఫరా చేశారు.

ధర్మారం: యూరియా లేక పంటలకు పెట్టిన పెట్టుబడులు నష్ట పోతున్నామని, ప్రభుత్వం వెంటనే యూరియా అందజేయాలని ధర్మారంలో సోమవారం రైతులు రాస్తారోకో చేశారు. ధర్మారం, కొత్తపల్లి, బొమ్మరెడ్డిపల్లి, ఎర్రగుంటపల్లి గ్రామ రైతులకు యూరియా అందించేందుకు ధర్మారంలోని సీఎస్‌సీ ఫర్టిలైజర్‌ దుకాణాన్ని కేటాయించారు. సోమవారం యూరియా కోసం సెంటర్‌కు చేరుకున్న ఆయా గ్రామాల రైతులు యూరియా రాలేదని తెలిసి ఆగ్రహానికి లోనయ్యారు. అనంతరం వరంగల్‌ రాయపట్నం రహదారిపై రాస్తారోకో చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని రైతులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు. సోమవారం సాయంత్రం యూరియా సెంటర్‌కు చేరుతుందని, మంగళవారం నుంచి ధర్మారంలోని సింగిల్‌ విండో గోదాంలో అందుబాటులో ఉంటుందని వ్యవసాయ అధికారులు తెలిపారు.

Updated Date - Sep 09 , 2025 | 12:21 AM