Share News

వైభవంగా మల్లికార్జున స్వామి కల్యాణం

ABN , Publish Date - Feb 24 , 2025 | 11:50 PM

ఓదెల మల్లికార్జునస్వామి కల్యాణాన్ని సోమవారం పురోహితులు, అర్చకులు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛరణాల మధ్య మధ్యాహ్నం 1.19 గంటలకు కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు దంపతులు పట్టు వస్త్రాలను, తలంబ్రాలను సమర్పించారు.

వైభవంగా మల్లికార్జున స్వామి కల్యాణం

ఓదెల, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : ఓదెల మల్లికార్జునస్వామి కల్యాణాన్ని సోమవారం పురోహితులు, అర్చకులు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛరణాల మధ్య మధ్యాహ్నం 1.19 గంటలకు కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు దంపతులు పట్టు వస్త్రాలను, తలంబ్రాలను సమర్పించారు. ఉదయం 10.30 నుంచి ప్రారంభమైన కల్యాణోత్సవ వేడుకలు, వేద పండితులు మధ్యాహ్నం వరకు కొనసాగించారు. అర్చకుల మంత్రోచ్ఛారణలతో మధ్య, మేళ తాళాలతో ఉత్సవ విగ్రహాలను వేదికకు తీసుకువచ్చి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

అనంతరం భక్తులు అక్షింతలు సమర్పించి ఆశీర్వచనాన్ని పొందారు. మంచిర్యాలకు చెందిన భక్తుడు సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. ఈఓ సదయ్య, వేద పండితులు డా.మహంతయ్య, భువనేశ్వర శాస్త్రి, జ్ఞానేశ్వర శాస్త్రి, శివ శంకర శాస్త్రి, ప్రత్యగాత్మ, అర్చకులు ధూపం మఠం వీరభద్రయ్య, భవాని ప్రసాద్‌, పంచాక్షరయ్య, గంగాధర స్వామి తోపాటు కాంగ్రెస్‌ నాయకులు, ఆలయ కమిటీ మాజీ ధర్మకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2025 | 11:50 PM