బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:10 AM
బాలికలు అం కితభావంతో చదివి అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకాంక్షిం చారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నెల రోజులుగా నిర్వహి స్తున్న బాలికా సాధికారత మిషన్(జెమ్) శిక్షణా శిబిరం ముగిసింది.
జ్యోతినగర్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): బాలికలు అం కితభావంతో చదివి అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకాంక్షిం చారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నెల రోజులుగా నిర్వహి స్తున్న బాలికా సాధికారత మిషన్(జెమ్) శిక్షణా శిబిరం ముగిసింది. బుధవారం ఎన్టీపీసీ పీటీఎస్ కాకతీయ ఆడిటోరియంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ హాజరై ప్రసంగించారు. శిక్షణ పొందిన 120 మంది బాలికలు తాము ఎంచుకున్న రంగంలో రాణించేందుకు కృషి చేయాలన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను ఎన్టీపీసీ మరిన్ని నిర్వహించాలన్నారు. శిక్షణ పొందిన బాలికలు తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని, వారికి స్ఫూర్తిని చ్చేలా వ్యవహరించాలని కోరారు. వర్క్‌షాప్‌ను విజ యవంతం చేయడంలో కృషి చేసిన సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఎన్టీపీసీ తమకు ఏం చేయడం లేదని ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని దూరం చేసేందుకు యాజమాన్యం చొరవ తీసుకోవా లన్నారు. చేసే మంచి పని ప్రజల్లోకి చేరేలా చూడడం కూడా ముఖ్యమ న్నారు. ఐదు దశాబ్ధాలుగా ఎన్టీపీసీ రాష్ట్రానికి, దేశానికి వెలుగులు పం చుతున్నదని పేర్కొన్నారు. ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్ సామంత ప్రసంగిస్తూ ఎన్టీపీసీ విద్యుత్ ఉత్ప త్తితోపాటు సామాజికాభివృద్ధి కృషి చేస్తున్న దన్నారు. సీఎస్‌ఆర్ పథకం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. విద్య, వైద్యం, మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక నిధులు ఖర్చు చేస్తున్నామని ఈడీ తెలిపారు. బాలికల్లో ఆత్మ విశ్వాసం, భవిష్యత్‌లో రాణించేందుకు జెమ్ వర్క్‌షాప్‌ను యేటా నిర్వహిస్తు న్నామని తెలిపారు. జానపద, శాస్త్రీయ, సినీ గీతాలపై విద్యార్థినులు నృత్యాలు ఆకట్టుకున్నాయి. శిక్షణ పొం దిన బాలికలకు కలెక్టర్ సర్టిఫికెట్లు అందజేశారు. ఐఎన్‌టియుసి జాతీయ కార్యదర్శి బాబర్ సలీంపాషా, దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత, జీఎంలు దేశాయ్, సింఘరాయ, ఏజీఎం(హెచ్‌ఆర్) విజయ్ కుమార్ సిక్దర్, అధకారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.