త్వరలో అందుబాటులోకి జిరియాట్రిక్ వార్డు
ABN , Publish Date - Nov 20 , 2025 | 11:55 PM
రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జిరియాట్రిక్ వార్డు త్వరలో అందుబాటులోకి వస్తుందని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ అన్నారు. వయసు పైబడిన, బెడ్ రిడెన్ పేషెంట్లకు ఈ సేవల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. సుల్తానాబాద్ మార్కండేయ కాలనీ వద్ద నిర్వహి స్తున్న సెంట్రల్ మెడిసిన్ స్టోర్, జిల్లా వ్యాక్సిన్ స్టోర్‌ను పరిశీలించారు.
సుల్తానాబాద్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జిరియాట్రిక్ వార్డు త్వరలో అందుబాటులోకి వస్తుందని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ అన్నారు. వయసు పైబడిన, బెడ్ రిడెన్ పేషెంట్లకు ఈ సేవల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. సుల్తానాబాద్ మార్కండేయ కాలనీ వద్ద నిర్వహి స్తున్న సెంట్రల్ మెడిసిన్ స్టోర్, జిల్లా వ్యాక్సిన్ స్టోర్‌ను పరిశీలించారు. అక్కడ మందుల నిల్వలు, రికార్డులను తనిఖీ చేశారు. మెడిసిన్ వ్యాక్సిన్ పంపిణీ విధానాలను సమీక్షించి, ఇండెంట్ మేరకు అన్ని ఆరోగ్య కేంద్రాలకు మందులను సరఫరా చేయాలన్నారు.
గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించారు. ప్రతి నెలా ఎఆర్‌వీ వ్యాక్సిన్ ప్రతీ ఆరోగ్య కేంద్రంలో స్టాక్ ఉండాలని ఆదేశించారు. క్యాన్సర్ నిర్దారణ అయి, చికిత్స పొందుతున్న పేషెంట్లకు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఫాలోఅప్ సేవలు, మందులు పంపిణీ చేస్తామని దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పూసాల రోడ్డులోని అమృత చిల్ట్రన్స్ ఆసుపత్రిని పరిశీలించి ఆసుపత్రి నిర్వాహకులతో మాట్లాడారు. కేవలం క్లినిక్ సేవలకు మాత్రమే ఉండాలని, అడ్మిషన్‌లు చేయరాదని తెలిపారు. వైద్యాధికారి లక్ష్మిభవాని, అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.