Share News

నేరాలకు పాల్పడేవారిపై గ్యాంగ్‌ ఫైల్స్‌ ఓపెన్‌ చేయాలి

ABN , Publish Date - Aug 23 , 2025 | 12:07 AM

పదేపదే నేరాలకు పాల్పడే వారిపై గ్యాంగ్‌ ఫైల్స్‌ ఓపెన్‌ చేయాలని పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌కిశోర్‌ఝా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనరేట్‌లో నేర సమీక్ష సమా వేశం నిర్వహించారు. జోన్‌ల వారీగా పెండింగ్‌ కేసులు, దర్యాప్తు, అరె స్టులు, చార్జిషీట్‌ దాఖపై తెలుసుకున్నారు.

నేరాలకు పాల్పడేవారిపై గ్యాంగ్‌ ఫైల్స్‌ ఓపెన్‌ చేయాలి

కోల్‌సిటీ, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): పదేపదే నేరాలకు పాల్పడే వారిపై గ్యాంగ్‌ ఫైల్స్‌ ఓపెన్‌ చేయాలని పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌కిశోర్‌ఝా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనరేట్‌లో నేర సమీక్ష సమా వేశం నిర్వహించారు. జోన్‌ల వారీగా పెండింగ్‌ కేసులు, దర్యాప్తు, అరె స్టులు, చార్జిషీట్‌ దాఖపై తెలుసుకున్నారు. పెండింగ్‌ కేసుల విషయమై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ కేసుల దర్యాప్తులో శాస్త్రీయ పద్ధతు లను అనుసరించి త్వరగా పరిష్కరించాలన్నారు. గణపతి నవ రాత్రులు ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతి మండపం వద్ద తప్పనిసరిగా పాయింట్‌ పుస్తకం ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సామాజిక మాద్యమం లో తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

కమిషనరేట్‌లో ఈ ఏడాది గంజాయి నియంత్రణ, నిర్మూలనలో కృషి చేసిన పోలీస్‌ అధికారులకు సీపీ రివార్డులు అందజేశారు. పెద్దపల్లి జోన్‌ పరిధిలో 34కేసుల్లో 98మందిని అరెస్టు చేశామని, 157కిలోల గంజాయిని సీజ్‌ చేశామని తెలిపారు. దీని విలువ రూ.77.63లక్షలుగా ఉంటుంద న్నారు. గంజాయిని పట్టుకోవడంలో కృషి చేసిన ఏసీపీ మల్లారెడ్డి, రామ గుండం సీఐ ప్రవీణ్‌ కుమార్‌, గోదావరిఖని టుటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌ రావు, యాంటీ నార్కోటెక్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌కుమార్‌లకు సీపీ క్యాష్‌ రివార్డు అందజేశారు. డీసీపీలు భాస్కర్‌, కరుణాకర్‌, ఎస్‌బీ ఏసీపీమల్లారెడ్డి, ఏసీపీలు రమేష్‌, ప్రకాష్‌, కృష్ణ, రవికుమార్‌, శ్రీనివాస్‌ ఉన్నారు.

Updated Date - Aug 23 , 2025 | 12:07 AM