గణేష్ నవరాత్రులను శాంతియుతంగా జరుపుకోవాలి
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:22 AM
వినాయక ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. గురువారం ధర్మా రం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన సీపీ, స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటిన అనంత రం రికార్డులను పరిశీలించారు.
ధర్మారం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): వినాయక ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. గురువారం ధర్మా రం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన సీపీ, స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటిన అనంత రం రికార్డులను పరిశీలించారు. మండల వ్యాప్తంగా దాదాపు 150 వినాయక విగ్రహా లను ఏర్పాటు చేస్తారని ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గణేష్ మండపాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ వైర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా పోలీసులు న్యాయం వైపే ఉండాలన్నారు. ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణకు డ్రగ్ సరఫరా అవుతున్నాయని, డ్రగ్స్ రవాణా చేసే వారితో పాటు వినియోగిస్తున్న వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడ సంఘటన జరిగినా గంటలోపే పోలీసులు చేరుకుంటారని తెలిపారు. డీసీపీ కరుణాకర్, ఏసీపీ జి.కృష్ణ, సీఐ కే.ప్రవీణ్ కుమార్, ధర్మారం ఎస్‌ఐ ఎం.ప్రవీణ్ కుమార్, బసంత్‌నగర్ ఎస్‌ఐ కె.స్వామి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.