గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:10 AM
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డీసీపీ కరుణాకర్ పేర్కొన్నారు. మంగళవారం గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఆయన స్టేష న్‌లో రికార్డులు, కేసుల పురోగతి, విచారణలో ఉన్న కేసుల గురించి వాకబు చేశారు.
కోల్‌సిటీ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డీసీపీ కరుణాకర్ పేర్కొన్నారు. మంగళవారం గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఆయన స్టేష న్‌లో రికార్డులు, కేసుల పురోగతి, విచారణలో ఉన్న కేసుల గురించి వాకబు చేశారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎలాంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయనే విష యంపై ఆరా తీశారు. మహిళా సిబ్బంది అన్నీ రకాల డ్యూటీలు చేసేలా ప్రోత్సహించాలన్నారు. పోలీస్ స్టేష న్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరించా లన్నారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుగా లని, సమస్మాక ప్రాంతాల్లో నిఘా పెట్టాలన్నారు. వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐలు భూమేష్, రమేష్, అనూష ఉన్నారు. డీసీపీ కరుణాకర్ బస్టాండ్ కాల నీలోని వినాయక మండపంలో నిర్వాహకులతో మాట్లా డారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకో వాలని, యువకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా చూడాలన్నారు.
సుల్తానాబాద్, (ఆంధ్రజ్యోతి): వినాయక నిమజ్జనోత్స వాన్ని శుక్రవారం ప్రశాంతంగా నిర్వహించుకోవాలని మున్సిపల్, పోలీస్, రెవెన్యూ అధికారులు సూచించారు. మున్సిపల్ కమిషనర్ టి రమేష్, తహసీల్దార్ బషీరొద్దిన్, సీఐ సుబ్బారెడ్డి, ఎస్‌ఐ శ్రావణ్ కుమార్, అశోక్ రెడ్డి, ఏఈ రాజ్‌కుమార్, సెక్షన్ ఆఫీసర్ రాజు, శ్రావణ్ తది తరులు చెరువు వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిర్వా హకులు సమయ పాలన పాటించాలని, ఈత రానివారు చెరువు వద్దకు రావద్దన్నారు. ప్రశాంతతకు భంగం కలిగించే పరిస్థితులు కలిగించవద్దన్నారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించవద్దన్నారు.