Share News

ఎయిర్‌ పోర్టు ఫ్రీ ఫిజిబులిటీ స్టడీకి నిధులు

ABN , Publish Date - Oct 12 , 2025 | 11:35 PM

రామగుండం నియోజక వర్గంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కృషి చేస్తున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుతూ గోదావరిఖని చౌరస్తాలో కాంగ్రెస్‌ నాయకుడు కామ విజయ్‌ ఆధ్వర్యంలో ఎంపీ వంశీకృష్ణ, మంత్రులు వివేక్‌, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం బాణాసంచ కాల్చారు.

ఎయిర్‌ పోర్టు  ఫ్రీ ఫిజిబులిటీ స్టడీకి నిధులు

గోదావరిఖని, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): రామగుండం నియోజక వర్గంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కృషి చేస్తున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుతూ గోదావరిఖని చౌరస్తాలో కాంగ్రెస్‌ నాయకుడు కామ విజయ్‌ ఆధ్వర్యంలో ఎంపీ వంశీకృష్ణ, మంత్రులు వివేక్‌, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం బాణాసంచ కాల్చారు. విజయ్‌ మాట్లాడుతూ అం తర్గాంలో 591 ఎకరాల స్థలంలో గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం ఫ్రీ ఫిజిబులిటీ స్టడీ కోసం రూ.40.53లక్షలను ఎయిర్‌పోర్టు అథారిటీకి చెల్లింపులు చేయడంలో ఎంపీ కీలక పాత్ర పోషించారని, అంతర్గాంలో ఎయిర్‌ పోర్టు ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముం దడుగు వేయడంలో ఎంపీ పాత్ర మరువలేనిదన్నారు.

రామగుండంలో ఎయిర్‌ పోర్టు వస్తే కనెక్టివిటీ పెరిగి వ్యాపారాలు అభివృద్ధి చెందుతా యని, రామగుండం ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుందన్నారు. నాయకులు అనుమాస శ్రీనివాస్‌ జీన్స్‌, వాసర్ల సురేందర్‌, హకీం, తిప్పారపు మధు, నరేందర్‌రెడ్డి, ముచ్చకుర్తి మహేష్‌, కిశోర్‌, జావెద్‌, శ్రీకాంత్‌, శ్రీను, మహేందర్‌, శేఖర్‌, అశోక్‌, శ్రావణ్‌, సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2025 | 11:35 PM